చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

Feb 21 2026 8:11 AM | Updated on Feb 21 2026 8:11 AM

చైర్మ

చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

పదవీ బాధ్యతలు స్వీకరించిన నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌

నర్సంపేట: నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా గంధం నరేందర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ శ్రీలక్ష్మి మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. రాజకీయాలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భాస్కర్‌, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికై న పాలకుర్తి సారంగపాణి, నేనావత్‌ షీబారాణితో మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు శుక్రవారం పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ సారంగపాణి మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలు రుణం తీర్చుకోలేదన్నారు. ఎమ్మెల్యే సహకారంతో సుపరిపాలన అందిస్తామని చెప్పారు.

ఆకేరు వాగు చెక్‌డ్యాం పనుల పరిశీలన

ఆకేరు వాగుపై రూ.65 లక్షల వ్యయంతో చేపట్టిన నిర్మాణ పనులను ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచడంతో పాటు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ ఇమ్మడి సుధీర్‌కుమార్‌, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ1
1/1

చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement