వెబ్‌సైట్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్లు | - | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్లు

Feb 20 2026 6:25 AM | Updated on Feb 20 2026 6:25 AM

వెబ్‌

వెబ్‌సైట్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్లు

కాళోజీ సెంటర్‌: ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్‌టికెట్లను తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ గురువారం వెబ్‌సైట్‌లో నమోదు చేసినట్లు వరంగల్‌ ఇంటర్‌ విద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ గురువారం తెలిపారు. విద్యార్థుల హాల్‌ టికెట్లు వారి కాలేజీ లాగిన్‌ ఐడీతో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అడ్మిషన్‌ టైమ్‌లో ఇచ్చిన రిజిస్టర్‌ మొబైల్‌కి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపించినట్లు వివరించారు. ఆ లింక్‌ ద్వారా విద్యార్థులు హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

15రోజుల వ్యవధిలో తల్లి, కుమారుడి మృతి

దుగ్గొండి: 15 రోజుల వ్యవధిలో తల్లి కుమారుడు మృతి చెందిన సంఘటన మండలంలోని నాచినపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన కత్తుల లచ్చమ్మ(80) 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. 4 రోజుల క్రితం కర్మకాండలు పూర్తి చేశారు. ఇదే క్రమంలో ఆమె కుమారుడు కత్తుల గట్టుమల్లు(50) తల్లి చనిపోయిన నాటినుంచి తీవ్ర బాధలో ఉండేవాడు. నిరంతరం తనతల్లితో గడిపిన గుర్తులు, కష్టాల్లో అండగా నిలబడ్డ విధానాన్ని తలచుకుంటూ నిత్యం మదనపడ్డాడు. ఈక్రమంలో గురువారం ఉదయం అకస్మాత్తుగా చతికిలబడి మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు, కూతురు ఉన్నారు. 15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో తల్లి కుమారుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

స్పోర్ట్స్‌ మీట్‌లో పతకాలు సాధించిన చందులాల్‌

పర్వతగిరి: హైదరాబాద్‌లో రెండ్రోజులుగా జరుగుతున్న నాల్గో తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ మీట్‌లో మండలానికి చెందిన పలువురు పోలీసులు ప్రతిభ చాటారు. సీత్యాతండాకు చెంది న గుగులోతు చందూలాల్‌ 6 పతకాలు సాధించి మండల కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేశారు. ఆయన ఆర్చరీ పోటీల్లో రికర్వ్‌ విభాగంలో భాగంగా 70 మీటర్ల పోటీల్లో రెండు గోల్డ్‌ మెడల్స్‌ సాధించాడు. అలాగే 50, 30 మీటర్ల పోటీల్లో సిల్వర్‌ పథకాలు, ఓరల్‌ విభాగంలో ఓరల్‌ గోల్డ్‌, ఎలిమినేషన్‌ విభాగంలో బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించాడు. చందూలాల్‌ ప్రస్తుతం ఖమ్మంలోని 15వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే తండాకు చెందిన జి.సుమన్‌, కల్లెడకు చెందిన ముంజాల రాజేశ్‌ టీం ఎలిమినేషన్‌ రౌండ్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్స్‌ గెల్చుకున్నారు. రాజేశ్‌, సుమన్‌ వరంగల్‌ మామునూరులోని నాల్గో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.

సోలార్‌ విద్యుత్‌ను వినియోగించుకోవాలి

ఆత్మకూరు: సోలార్‌ విద్యుత్‌ను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రాన్ని మోడల్‌ సోలార్‌ విద్యుత్‌ గ్రామంగా ఎంపిక చేసి గురువారం ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి కలెక్టర్‌ స్నేహ శబరీష్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూ రు గ్రామాన్ని పూర్తిస్థాయిలో సోలార్‌ విద్యుత్‌ వినియోగ గ్రామంగా రూపొందించుకుంటున్నామన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రామ్‌ రెడ్డి మాట్లాడుతూ.. మోడల్‌ గ్రా మంగా ఆత్మకూరును ఎంచుకోవడం సంతోషకరం అన్నారు. గ్రామ ప్రజలు సోలార్‌ విద్యుత్‌ ను సక్రమంగా వినియోగించుకోవాలని కోరా రు. కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. గ్రామంలో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతీ ఇంటికి సోలార్‌ విద్యుత్‌ అందేలా అధికారులు పనిచేయాలన్నారు. లబ్ధిదారులకు సోలార్‌ విద్యుత్‌పై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పర్వతగిరి మహేశ్వరి, ఎంపీడీఓ శ్రీని వాసరెడ్డి తహసీల్దార్‌ జగన్మోహన్‌రెడ్డి, ఎస్‌ఈ మధుసూదన్‌, డీఈ మల్లికార్జున్‌, డీఎం మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్లు 
1
1/1

వెబ్‌సైట్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement