విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు | - | Sakshi
Sakshi News home page

విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు

Mar 1 2026 7:23 AM | Updated on Mar 1 2026 7:23 AM

విభిన

విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు

ఇదివరకు ఎవరైనా ఇంటికొస్తే కాసేపు మాట్లాడాక ఫొటో ఆల్బమ్‌ ముందు పెట్టేవాళ్లు. ఫొటోలు చూపిస్తూ సరదాగా గడిపేవాళ్లు. ఇప్పుడు టీవీలు ఆన్‌ చేస్తున్నారు. ఫొటో షూట్‌లు, వీడియో ఆల్బమ్‌లు చూపిస్తున్నారు. డిఫరెంట్‌ లొకేషన్లలో భారీ సెట్టింగుల్లో దిగిన ఫొటోలు, మంచి మంచి లొకేషన్లలో, ఆకట్టుకునే పాటలతో తయారు చేసిన వీడియోలు ప్లే చేస్తున్నారు. చిన్నారుల జ్ఞాపకాలు చిరకాలం పదిలంగా ఉండేలా ఆల్బమ్‌లు రూపొందిస్తున్న స్టూడియోలపై ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ..

– ఖిలా వరంగల్‌

ఫొటోలు తీసుకునేందుకు ఒకప్పుడు పార్కులు, నది, సముద్రతీరాలు, చారిత్రక కట్టడాల వంటి ప్రదేశాలకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు వాటినే మన ముందుకు తీసుకొచ్చారు ఫొటో స్టూడియోల నిర్వాహకులు. డిఫరెంట్‌ సెట్లతో బేబీ ఫొటో స్టూడియోలు ఎక్కడికక్కడ ఏర్పాటయ్యాయి. బేబీ ఫొటో షూట్‌ ట్రెండ్‌ ఏళ్ల కిందటి నుంచే ఉన్నప్పటికీ ఈ మధ్య ఈ విధానంపై గ్రేటర్‌ వరంగల్‌ వాసుల ఆసక్తి మరింత పెరిగింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా సృజనాత్మకతంగా చూపించడంతో అందరి దృష్టి ఫొటో షూట్‌వైపు పడుతోంది. ప్రస్తుతం ఇదొక ఆనవాయితీగా మారిందని ఫొటో స్టూడియోల నిర్వాహకులు చెబుతున్నారు.

అభిరుచికి అనుగుణంగా..

పిల్లల తల్లిదండ్రుల అభిరుచి మేరకు ఏదైనా విభిన్న సెట్‌ కావాలంటే.. అదనపు ఖర్చుతో నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రక కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‌ మధ్యకోటలో మనసుదోచేలా ఆహ్లాదం కల్పించేలా భారీ సెట్లతో స్టూడియో ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని చిన్న పిల్లల మనసు దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో మధ్యతరగతి వర్గాలు సైతం ఈషూట్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

అందరికీ అందుబాటులో ధరలు

బేబీ స్టూడియోలు మధ్యకోట, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు, రామప్ప, భూపాలపల్లి, కాళేశ్వరం, జనగామ జిల్లా, మండల కేంద్రాల్లోనూ ఉన్నాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో తెరిచి ఉంటాయి. బర్త్‌ డే అల్బమ్‌ కోసం రూ.10 వేల నుంచి రూ. 25వేల వరకు చార్జ్‌ చేస్తున్నారు. స్టూడియోలో ఏదైనా ఆట వస్తువులు ఉపయోగించుకుంటే రూ.1500 నుంచి రూ.2500 వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అయితే వీటికి మంచి డిమాండ్‌ ఉంటుంది. ముందుగా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫొటోగ్రాఫర్‌ను ఔత్సాహికులు తెచ్చుకుంటే.. గంటకు రూ.1,500 చార్జ్‌, అదే నిర్వాహకుల ఫొటోగ్రాఫర్‌ అయితే గంటకు రూ.2,500 వరకు తీసుకుంటామని చెబుతున్నారు. వీటి ఏర్పాటుకు దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఓ స్టూడియో నిర్వాహకుడు పేర్కొన్నారు.

బర్త్‌డేకు ఫొటో షూట్‌ చేయించాం..

మా బాబు ఫస్ట్‌ బర్త్‌డేను ప్రత్యేకమైన రోజుగా చూస్తున్నాం. తీపి గుర్తు కోసం బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకులు జరుపుకున్నాం. బర్త్‌డే అంటే స్పెషల్‌ డేగా గుర్తించి ఆధునిక హంగులతో కూడిన బేబీ స్టూడియోలో ఫొటో షూట్‌ చేయించాం. తరచూ ఫొటోలు, వీడియోలు చూసి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ సంతోషిస్తున్నాం.

– అయాన్‌తో తల్లిదండ్రులు అఖిల, జూహకర్‌

పిల్లలు మెచ్చేలా..

చిన్నారులు ఇష్టపడే బాహుబలి, పోలీస్‌ స్టేషన్‌, విమానం, బేబీ షవర్‌, జీప్‌ డ్రైవింగ్‌, ఉయ్యాల, నది వంతెన, ట్రైన్‌, బైక్‌, గార్డెనింగ్‌, చారిత్రక అందాల సీన్స్‌ వంటి సెట్లను స్టూడియోల నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. తాజ్‌మహల్‌, కొలనులు, స్విమ్మింగ్‌ పూల్‌, దేవాలయం, గ్రామీణ నేపథ్యం ఉండే సెట్లు సైతం వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సెట్‌కు తగిన మేకప్‌ కిట్లు, దుస్తులు స్టూడియోలోనే అందుబాటులో ఉంచుతున్నారు. కొన్నింటిలో పుట్టిన రోజు వేడుకలు సైతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఏడాది వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల పిల్లల కోసం ప్రత్యేక సెట్లు స్టూడియోల్లో అందుబాటులో ఉన్నాయి.

ఆకట్టుకుంటున్న స్టూడియోలు

సమయానుగుణంగా ధరలు

ఏఐ సాంకేతికతతో మరింత క్రేజ్‌

విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు1
1/3

విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు

విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు2
2/3

విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు

విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు3
3/3

విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement