వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Feb 21 2026 8:11 AM | Updated on Feb 21 2026 8:11 AM

వరంగల

వరంగల్‌

– IIలోu

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఉద్యాన పంటలకు

అమ్ముకోలేక.. పారబోయలేక

మార్కెట్‌లో టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఓ రైతు కొత్తగూడ మండలకేంద్రంలో ఉచితంగా పంచిపెట్టారు.

ఖిలా వరంగల్‌: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఉద్యాన మిషన్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఉద్యాన పంటలు సాగు చేసేలా పలు రకాల వ్యవసాయ పరికరాలు, యంత్రాలను రాయితీపై అందజేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ కార్యక్రమం సాగుతోంది. వరి, పత్తి సోయాబిన్‌ వంటి పంటలే కాకుండా కూరగాయలు, పండ్లు, పూల సాగుపై కర్షకులకు ఆసక్తి కలిగించేందుకు ప్రభుత్వం రాయితీ యూనిట్లను మంజూరు చేసిందని వరంగల్‌ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి ఆర్‌.శ్రీనివాసరావు పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రైతులకు 50శాతం, ఇతరులకు 40శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తోంది.

సబ్సిడీపై యంత్ర పనిముట్లు

చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ శక్తి తక్కువగా ఉన్న ప్రాంతాలకు వ్యవసాయ యాంత్రీకరణ పరిధిని పెంచడం కోసం, హైటెక్‌, అధిక విలువ గల వ్యవసాయ పరికరాల కోసం కేంద్రాలను సృష్టించడం, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను కొనుగోలు చేయడానికి రైతులకు ఆర్థిక సాయాన్ని ఉద్యానశాఖ అందిస్తోంది. ప్రధానంగా యూనిట్‌ ధర మొత్తం రూ.4.90 లక్షల విలువైన మినీ ట్రాక్టర్లు, రూ.2 లక్షల విలువైన పవర్‌ టిల్లర్లు, రూ.1.50 లక్షల విలువైన కలుపు తీసేయంత్రం (పవర్‌ వీడర్‌), రూ.5 వేల విలువైన గడ్డి కోత యంత్రాలు (బ్రష్‌ కట్టర్‌ (ఎలక్ట్రిక్‌, ఇంజిన్‌ పవర్డ్‌), మొక్కల సంరక్షణ పరికరాలు రూ.2 వేల విలువైన తైవాన్‌ స్ప్రేయర్లు (పవర్డ్‌ నాఫ్‌శాక్‌ స్ప్రేయర్‌, ఆపరేటెడ్‌ స్ప్రెయర్‌), కూరగాయలు పెట్టుకునే ప్లాస్టిక్‌ బుట్టలు వంటి పరికరాలను సంబంధిత అధికారులు అందజేస్తారు.

నేరుగా రైతు ఖాతాలోకి సబ్సిడీ

దరఖాస్తులను పరిశీలించి అర్హులను అధికారులు ఎంపిక చేస్తారు. ఎంపికై న రైతు తొలుత తన సొంత డబ్బులు పెట్టి వ్యవసాయ పరికరం లేదా యంత్రం కొనుగోలు చేయాలి. వాటి జీఎస్టీ సహిత బిల్లును జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ కార్యాలయంలో ఈనెల 28లోగా సమర్పించాలి. రైతు కొనుగోలు చేసిన రాయితీ యూనిట్‌ను పరిశీలించి ప్రభుత్వ ఖజానా నుంచి రాయితీ డబ్బులు నేరుగా సదరు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సమగ్ర ఉద్యాన మిషన్‌ పథకం, రాయితీపై వ్యవసాయ పరికరాలు, యంత్రాల కొనుగోలు వివరాల కోసం జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు 89777 14055 నంబర్‌లో సంప్రదించాలి. అలాగే, డివిజన్‌ పరిధి అధికారులు వరంగల్‌ 89777 14060, వర్ధన్నపేట 89777 14059, నర్సంపేట 89777 14061, నెక్కొండ 89777 14053 నంబర్లలోనైనా సంప్రదించవచ్చు.

ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలి

రాయితీపై పరికరాలు కోసం రైతులు పట్టా పాస్‌ పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పాస్‌బుక్‌ జిరాక్స్‌ ప్రతులు జతచేసి ఈనెల 28లోపు వరంగల్‌ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ కల్పించే సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 28 లోపు దరఖాస్తు చేసుకున్న రైతులకు మినీ ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు, పవర్‌ వీడర్‌, బ్రష్‌ కట్టర్‌, స్ప్రేయర్లను సబ్సిడీపై అందించనున్నాం. ఆసక్తి గల రైతులు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

– శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన,

పట్టు పరిశ్రమ శాఖ అధికారి

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సాయం

రాయితీపై యంత్రాలు, పరికరాలు

28లోపు దరఖాస్తు చేసుకోవాలి

అవకాశాన్ని సద్వినియోగం

చేసుకోవాలంటున్న అధికారులు

పంటలు విస్తీర్ణం (ఎకరాల్లో)

పూలు 80

అరటి 470

మామిడి 5,750

ఆయిల్‌పామ్‌ 6,200

మల్బరీ 148

మిర్చి 2,000

పసుపు 800

కూరగాయలు 1,065

వరంగల్‌1
1/4

వరంగల్‌

వరంగల్‌2
2/4

వరంగల్‌

వరంగల్‌3
3/4

వరంగల్‌

వరంగల్‌4
4/4

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement