ఆలయ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయం
నెక్కొండ: యువ వైద్యుడు ప్రజల ఆరోగ్యానికి ఎంతోప్రాధాన్యం ఇస్తూ.. ఆధ్యాత్మిక సేవలోనూ పాలు పంచుకుంటురన్నారని టీపీసీసీ సభ్యుడు సొంటిరె డ్డి రంజిత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వట్టె వాగు సమీపంలోని పంచముఖాంజనేయ ఆలయ అభివృద్ధి పనులకు ఆదివారం రంజిత్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నెక్కొండకు చెందిన మల్లంపాటి కనకమ్మ–నర్సింహారెడ్డి దంపతుల జ్ఞాపకార్థం వారి మనుమడు నర్సింహారెడ్డితోపాటు కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక వికాసం, సమాజ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. డాక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దైనందిన జీవితంలో ఉద్యోగ, వ్యాపార పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా మానసిక స్వాతంన, మనోవికాసం కలుగుతుందన్నారు. కుటుంబ సభ్యులు సంజీవరెడ్డి, నవీన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి సహకారంతో సు మా రు రూ.8లక్షల వ్యయంతో ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చామన్నారు. రావుల హరీశ్‌రెడ్డి, స ర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, సంపత్‌రావు, న ర్సింహారెడ్డి, గోపాలకష్ణమూర్తి శర్మ పాల్గొన్నారు.
టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి
పంచముఖాంజనేయ ఆలయానికి వైద్యుడు నర్సింహారెడ్డి రూ. 8 లక్షలు విరాళం


