పట్టణాన్ని ఆదర్శంగా నిలపాలి | - | Sakshi
Sakshi News home page

పట్టణాన్ని ఆదర్శంగా నిలపాలి

Feb 26 2026 7:20 AM | Updated on Feb 26 2026 7:20 AM

పట్టణాన్ని ఆదర్శంగా నిలపాలి

పట్టణాన్ని ఆదర్శంగా నిలపాలి

వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్మన్‌ సారంగపాణి

వర్ధన్నపేట: అధికారులు, సిబ్బంది వర్ధన్నపేట పట్టణ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేసి ఆదర్శంగా నిలవాలని మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ము న్సిపల్‌ కమిషనర్‌ సుధీర్‌కుమార్‌, అధికారులు, సిబ్బంది, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వార్డుల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. డ్రెయినేజీలు శుభ్రం చేయడం, దోమల నివారణకు ఫాగింగ్‌, వీధుల్లో దీపాలు ఏర్పాటు చేయడం తదితర అంశాల పై చర్చించారు. ఏమైనా సమస్యలు ఉన్నపుడు తన దృష్టికి తీసుకురావాలని, వార్డు కౌన్సి లర్లు అందరూ సమన్వయంతో ముందుకు సాగుతామని వారిచ్చే సలహాలను సూచనలను తప్పనిసరిగా స్వీకరిస్తామన్నారు. అనంతరం ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి నిత్యావసర సరుకులను అందచేశారు. సమావేశంలో వైస్‌ చైర్‌ పర్సన్‌ నేనావత్‌ షీభారాణి, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, బానోతు జ్యోతి, గుజ్జ వీరన్న, నూనావత్‌ కమిలి, మాలోతు దేవేందర్‌, తిరుపతి సురేష్‌, సిలువేరు రమ, అరుణ, కుమారస్వామి, వాణి, తదితరులు పాల్గొన్నారు.

చెత్త సేకరణలో సమయపాలన పాటించాలి

గ్రేటర్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

వరంగల్‌ అర్బన్‌: ఇంటింటా చెత్త సేకరణలో సమయపాలన పాటించాలని, సెకండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు నిర్ణీత సమయంలో వాహనాలు చేరుకోవాలని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. హనుమకొండ బాలసముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్‌ షెడ్‌కు చేరే స్వచ్ఛ ఆటోలు, వాహనాలు తడి, పొడి చెత్తను వేరు గా తీసుకొస్తున్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement