‘చెత్త’పై నిర్లక్ష్యం.. కమిషనర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

‘చెత్త’పై నిర్లక్ష్యం.. కమిషనర్‌ ఆగ్రహం

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

‘చెత్త’పై నిర్లక్ష్యం.. కమిషనర్‌ ఆగ్రహం

‘చెత్త’పై నిర్లక్ష్యం.. కమిషనర్‌ ఆగ్రహం

‘చెత్త’పై నిర్లక్ష్యం.. కమిషనర్‌ ఆగ్రహం

వరంగల్‌ అర్బన్‌: ఖాళీ ప్రదేశాల్లో, కుండీల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా పరిశీలించిన కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆగ్రహానికి లోనయ్యారు. జవాన్ల తీరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇద్దరికి రూ.2 చొప్పున జరిమానాలు విధించి వసూలు చేయాలని సీఎంహెచ్‌ఓను ఆదేశించారు. సోమవారం ఉదయం కమిషనర్‌ 4, 8 డివిజన్లలోని కాకతీయ కాలనీ, అక్షర కాలనీ. కేయూసీ రోడ్డు, ఓల్డ్‌ రాయపుర ప్రాంతాల్లో కమిషనర్‌ పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్దేశిత సమయంలో గార్బేజీ బిన్‌లను శుభ్రం చేయకపోవడం, ఓపెన్‌ డంప్‌ గార్బేజీ ఎక్కువగా నిలిచి ఉండడం వల్ల సీరియస్‌ అయ్యారు. జవాన్లకు కేటాయించిన రిజిస్టర్‌లో ఆ రోజు చేసిన శానిటేషన్‌ కార్యక్రమాలను నమోదు చేయాలన్నారు. పెద్దమ్మ గడ్డ వద్ద ఉన్న కల్వర్టు వద్ద ఉన్న ఓపెన్‌ డంప్‌ను శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో సీఎం హెచ్‌ఓ రాజారెడ్డి, ఈఈ రవికుమార్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ నరేందర్‌, ఏఈ హరికుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌ తదితరులు ఉన్నారు.

ఇద్దరు జవాన్లకు పెనాల్టీ

ఆకస్మిక తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement