సిద్ధాపురంలో వృద్ధుడి హత్య | - | Sakshi
Sakshi News home page

సిద్ధాపురంలో వృద్ధుడి హత్య

Feb 25 2026 10:41 AM | Updated on Feb 25 2026 10:41 AM

సిద్ధ

సిద్ధాపురంలో వృద్ధుడి హత్య

● మరదలిపై అనుమానం ● పోలీసులకు ఫిర్యాదు

హసన్‌పర్తి: ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హసన్‌పర్తి మండలం సిద్ధాపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్నె మొగిలి(70)కి కుమారుడు రాజ్‌కుమార్‌, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొగిలి, రాజ్‌కుమార్‌ నగరంలో ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉంటున్నారు. దీంతో మొగిలి మరదలు ఇందిర(ఒంటరి మహిళ) సిద్ధాపురంలోని అతడి ఇంటిలో ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల భార్య సరోజన మృతి చెందడంతో మొగిలి తిరిగి స్వగ్రామం వచ్చాడు. అప్పటి నుంచి నుంచి ఇందిర అతడితో నిత్యం గొడవ పడుతోంది. ఈవిషయమై ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి రాజ్‌కుమార్‌ ఇంటికొచ్చాడు. ఇదిలా ఉండగా, మంగళవారం మొగిలి ఇంటి ఆవరణలో శవమై కనిపించాడు. ఈవిషయాన్ని గమనించిన బంధువులు కుమారుడు రాజ్‌కుమార్‌కు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత, స్థానిక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చేరాలు, ఎస్సై రవి, దేవేందర్‌ ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం స్థానికంగా విచారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇందిరపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చేరాలు తెలిపారు.

సిద్ధాపురంలో వృద్ధుడి హత్య
1
1/1

సిద్ధాపురంలో వృద్ధుడి హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement