లింగగిరిలో ఎలుగుబంటి ప్రత్యక్షం
చెన్నారావుపేట: మండలంలోని లింగగిరి గ్రామం చెన్నకేశవస్వామి దేవాలయం సమీపంలోని గుట్టల్లో బుధవారం ఉదయం ఎలుగుబంటి రైతుల కంటపడింది. గుట్టల వైపు నుంచి పలువురు రైతుల పంట పొలాల్లో గత రెండు రోజులుగా సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎలుగుబంటితోపాటు రెండు పిల్లలు సైతం ఉన్నట్లు రైతులు తెలిపారు. దీంతో సర్పంచ్ రజితకుమారస్వామి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నర్సంపేట ఫారెస్టు సెక్షన్ అధికారి సరిత, బీట్ అధికారి యోగేష్, చెన్నారావుపేట ఎస్సై రాజేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎలుగుబంటి కోసం రెష్కూ టీమ్ పంటపొలాల్లో అన్వేషించింది. ఎంత వెతికినా ఎలుగుబంటి ఆచూకీ లభించలేదు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులకు పలుసూచనలు చేశారు. రాత్రిపూట ఎవరూ పొలాల వద్దకు వెళ్లొద్దని, ఉదయం 8 గంటలు దాటిన తర్వాత మాత్రమే వెళ్లాలని సూచించారు. పొలాల వద్దకు వెళ్లేటప్పుడు అగ్గిపెట్టే తప్పకుండా వెంట తీసుకెళ్లాలని, ఎలుగుబంటి కనిపిస్తే నిప్పు పెట్టాలని తెలిపారు.
ఆందోళనలో గ్రామస్తులు
పట్టుకోవడానికి ప్రయత్నించిన అటవీశాఖ అధికారులు
లింగగిరిలో ఎలుగుబంటి ప్రత్యక్షం


