విద్యార్థుల హాల్‌ టికెట్లపై తొలిసారిగా క్యూ ఆర్‌ కోడ్‌లు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల హాల్‌ టికెట్లపై తొలిసారిగా క్యూ ఆర్‌ కోడ్‌లు

Feb 24 2026 9:10 AM | Updated on Feb 24 2026 9:10 AM

విద్యార్థుల హాల్‌ టికెట్లపై తొలిసారిగా క్యూ ఆర్‌ కోడ్‌ల

విద్యార్థుల హాల్‌ టికెట్లపై తొలిసారిగా క్యూ ఆర్‌ కోడ్‌ల

విద్యారణ్యపురి: ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు హనుమకొండ జిల్లాలో పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 25 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి మొత్తం 38,600 మంది పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 7, టీఎస్‌సోషల్‌వెల్ఫేర్‌ జూనియర్‌కాలేజిలు 1, మోడల్‌ జూనియర్‌ కాలేజీలు 2, ప్రయివేటు అన్‌ఎయిడెడ్‌ కళాశాలలు 42 ఉన్నాయి. 52 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, అదనపు చీఫ్‌ సూపరింటెండెంట్లు 42 మందిని నియమించారు. 52 మంది డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లును నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్లను, నాలుగు సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించారు.ప్రైవేట్‌ కళాశాలలు ఫీజుల పేరిట హాల్‌ టికెట్లు ఇవ్వకపోతే ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షల సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.

సీసీ కెమెరాల నిఘాలో..

ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాల్లో ప్రతీ పరీక్ష కేంద్రంలో 2 లేదా మూడు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల సమీపంలో జిరాక్స్‌ సెంటర్లను మూసివేస్తారు. కేంద్రాల సమీపంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. పరీక్షల నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్‌లు తీసుకొని పరీక్ష కేంద్రాలకు వెళ్లకూడదు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లకూడదు.

పకడ్బందీగా నిర్వహిస్తాం..

హనుమకొండ జిల్లాలో ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. సీఎస్‌లకు, డీఓలకు ఇప్పటికే పలు సూచనలిచ్చాం. ఇంటర్‌ బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి సదుపాయాలు కల్పించనున్నాం. మాల్‌ ప్రాక్టీస్‌కు ఎవరైనా పాల్ప డితే చర్యలు తప్పవు. ఏమైనా ఫిర్యాదులు, సందేహాలకు డీఐఈఓ కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌ 93816 72094, 95027 43435లో సంప్రదించవచ్చు. విద్యార్థులు పరీక్ష సమయానికి ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది.

– గోపాల్‌, డీఐఈఓ, హనుమకొండ

జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు

రేపటి నుంచి ఎగ్జామ్స్‌ షురూ..

ఫస్ట్‌ ఇయర్‌లో 18,596 మంది,

సెకండియర్‌లో 20,004 మంది విద్యార్థులు

మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు,

నాలుగు సిట్టింగ్‌ స్క్వాడ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement