సర్టిఫికెట్ల జారీలో జ్యాపం వద్దు | - | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్ల జారీలో జ్యాపం వద్దు

Feb 21 2026 8:13 AM | Updated on Feb 21 2026 8:13 AM

సర్టిఫికెట్ల జారీలో జ్యాపం వద్దు

సర్టిఫికెట్ల జారీలో జ్యాపం వద్దు

సర్టిఫికెట్ల జారీలో జ్యాపం వద్దు

అదనపు కలెక్టర్‌ రవి

వేలేరు: తహసీల్దార్‌ కార్యాలయంలో సర్టిఫికెట్స్‌ జారీలో జ్యాపం చేయొద్దని హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్‌ కార్యాలయం, కేజీబీవీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా తహసీల్దార్‌ కార్యాలయంలో భూ భారతి, పలు సర్టిఫికెట్ల పెండింగ్‌ వివరాలు, సాదాబైనామా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ మొదలైన వాటి వివరాల స్టేటస్‌లు తహసీల్దార్‌ కోమిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కేజీబీవీ పాఠశాలలో భోజనం, స్టాక్‌ రిజిస్టర్‌, కంప్లైంట్‌ బాక్స్‌లను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిజిస్ట్రర్‌, మందులు, ల్యాబ్‌, ఆపరేషన్‌ థియేటర్‌ను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హెచ్‌.కోమి, పీహెచ్‌సీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ నవీన్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement