బోనస్‌ సంబురం | - | Sakshi
Sakshi News home page

బోనస్‌ సంబురం

Mar 2 2026 7:15 AM | Updated on Mar 2 2026 7:15 AM

బోనస్

బోనస్‌ సంబురం

జిల్లాలో వానాకాలంలో 1,62,269 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

ఖిలా వరంగల్‌: రైతుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. వానాకాలం సన్న ధాన్యం బోనస్‌ బకాయిలు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. గడిచిన వానాకాలంలో జిల్లాలోని 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. పీఏసీఎస్‌ సొసైటీలు, మెప్మా, ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 39,567 మంది రైతుల నుంచి 1,62,269.40 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జనవరి మొదటి వారానికే ధాన్యం సేకరణ పూర్తి కాగా సన్న రకాలకు సంబంధించి క్వింటాకు రూ.500ల చొప్పున బోనస్‌ మొత్తం రూ.79,20,58,800 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇందులో శనివారం సాయంత్రం వరకు రూ.78,23,58,800కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయగా మరో రూ.97 లక్షలు విడుదల కావాల్సి ఉంది.

రైతుకు ప్రోత్సాహం

రాష్ట్రంలో రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చే స్తుండటంతో స్థానిక అవసరాలు పెరిగా యి. మరోవైపు కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వరి సాగు గణనీయంగా పెరగడంతో రాష్ట్రం నుంచి దొడ్డుబియ్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం గత సీజన్లలో సేకరించిన దొడ్డు ధాన్యం మిల్లులు, బియ్యం గోదాముల్లో పేరుకుపోయాయి. గత వానాకాలం నుంచి సన్నాలను సాగు చేయించాలనే ప్రభుత్వ ఆదేశాలతో రైతులు సన్న ధాన్యం పంటకు మొగ్గుచూపుతున్నారు. దీనికి ప్రభుత్వం రూ.500లు బోనస్‌ రూపేనా చెల్లించి పోత్సహిస్తోంది.

జిల్లాలో 1,62,269 మెట్రిక్‌ టన్నుల

ధాన్యం సేకరణ

జిల్లాలో గత వానాకాలంలో సుమారు 1,62,269.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 265 కొనుగోలు కేంద్రాల నుంచి ప్రభుత్వం సేకరించింది. వీటిలో 1,67,269 మెట్రిక్‌ టన్నుల సన్న రకం ధాన్యానికి సంబంధించిన రూ.79,20,58,800 కోట్లను ప్రభుత్వం రైతులకు బోనస్‌ రూపంలో చెల్లించాలి. సన్న రకం క్వింటాకు రూ.500లు బోనస్‌ చెల్లింపులకు చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు రూ.78,23,58,800 కోట్లు బోనస్‌ రూపంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా రూ. 97 లక్షలు మాత్రమే జమ చేయాల్సి ఉంది.

రైతుల ఖాతాల్లో

రూ.78.23 కోట్లు జమ

జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం

బోనస్‌ సంబురం1
1/1

బోనస్‌ సంబురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement