గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి
వర్ధన్నపేట: యువకులు సంఘాలుగా ఏర్పాడి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మేరా యవ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభ్యాస్ ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. యువ మండల్ అభ్యాస్ ద్వారా యువజన సంఘాల అభివృద్ధితో పాటు గ్రామాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. యువత సంఘాలుగా ఏర్పడి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పోత్సాహాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. మండల పరిఽధిలో క్రీడా స్టేడియాన్ని త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు. అనంతరం పాల్గొన్న యువకులకు సర్టిఫికెట్ అందించారు. ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింత అన్వేష్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ నవీన్‌యాదవ్, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల నుంచి యువకులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ సారంగపాణి


