నేడు వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌

Mar 2 2026 8:55 AM | Updated on Mar 2 2026 8:55 AM

నేడు వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌

నేడు వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌

నేడు వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌

జిల్లా స్థాయి పోటీలకు 200 మంది డిగ్రీ విద్యార్థులు

కేయూ క్యాంపస్‌: వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌–హనుమకొండ జిల్లా స్థాయి పోటీలను కేయూలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఈనెల 2న నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.రమణ, కన్వీనర్లు డి. శైలజ, డాక్టర్‌ ఎన్‌.సౌజన్య ఆదివారం తెలిపారు. కేయూ కో–ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో మై భారత్‌ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు, భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అంశంపై ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మై భారత్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకున్న విద్యార్థుల్లో 200 మందికి ఈ పోటీల్లో అవకాశం కల్పించనున్నట్లు కేయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ ఆచార్య ఈసం నారాయణ తెలిపారు. ఐదుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement