నా భూమి టెక్స్‌టైల్ పార్కు నిమిత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సర్వే చేసి నా ఖాతాలో డబ్బులు జమచేసింది. అందులో నుంచి నా కూతురు వివాహ నిమిత్తం బ్యాంకు ఖాతాలో సుమారు రూ.3 లక్షలకు పైగా నిల్వ ఉంచాను. అయితే, ఆర్డీఓ ఆదేశాల మేరకు ఆ డబ్బు వాపస్ పోయిందని బ్యాంకు మేనేజర్ తెలిపారు. కూతురు వివాహం కోసం దాచుకున్న ఆ డబ్బులు ఇప్పించండి. నాకు భూమి తక్కువ ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. తిరిగి సర్వే చేయించి నాకు న్యాయం చేయండి. – జె.కొంరయ్య, చింతలపల్లి
యాక్ట్ ప్రకారం పరిష్కారం చూపండి
వృద్ధాప్యంలో తమ సంతానం తమకు సహకరించడం లేదని, మౌలిక సదుసాయాలు కల్పించడం లేదని సీనియర్ సిటిజన్స్ అంటున్నారు. ఆసరాగా నిలబడడం లేదని గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదులు చేశారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007, డిసెంబర్ 29 ప్రకారం 60రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించాలి. కానీ అధికారులు మాత్రం కాలయాపన చేస్తున్నారు.
– ఇనుముల రమేష్, లోక్‌సత్తా నగర కార్యదర్శి


