ఇంటి నుంచి వెళ్లగొట్టారు | - | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి వెళ్లగొట్టారు

Mar 3 2026 7:15 AM | Updated on Mar 3 2026 7:15 AM

30 ఏళ్ల క్రితం సీపీఎం ఆధ్వర్యంలో ఉచితంగా కేటాయించిన స్థలంలో నేను ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు నా కొడుకు, కోడలు ఆ ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టడంతో సమీపంలోని కమ్యూనిటీ హాల్‌లో జీవనముంటున్నా. పింఛను కూడా రాకుండా చేశారు. పలుమార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయాలి. – మహ్మద్‌ అంకూస్‌, సుందరయ్య నగర్‌, వరంగల్‌

దొంగ కాగితాలు సృష్టించారు

నేను చింతనెక్కొండ శివారులో 1.39గుంటల భూమిని కొనుగోలు చేశాను. నా భూమి నుంచే నేషనల్‌ హైవే వెళ్తోంది. ఈ క్రమంలో నా భూమి సర్వే నంబర్లతో దొంగ కాగితాలు సృష్టించి మా దగ్గరి బంధువులు నష్టపరిహారం పొందారు. నకిలీ పత్రాల ద్వారా పరిహారం తీసుకొన్న వారిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి.

– బి.సమ్మయ్య, చింతనెక్కొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement