వేలేరు: దేవాదుల పైపులైన్ల లీకేజీలు షరా మాములయ్యాయి. వేలేరు మండల పరిధి మల్లికుదుర్ల శివారులోనుంచి వెళ్తున్న దేవాదుల పైప్‌లైన్ గేట్‌వాల్వ్ సోమవారం లీక్ కావడంతో 60 అడుగుల మేర నీళ్లు ఎగసిపడుతున్నాయి. కాగా, మల్లికుదుర్ల చుట్టు పక్కల గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు తమ పంట పొలాలకు సాగునీటి కోసం పైప్ లైన్ లీక్ చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.
ఆకాశానికి
ఎగసిపడుతున్న
దేవాదుల
పైప్‌లైన్ నీరు


