సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026
న్యూస్‌రీల్
పర్యవేక్షించే వారు కరువు..
కర్రీ పాయింట్లు, రైతుబజార్లు అంతే..
తనిఖీలు చేసి నోటీసులిస్తున్నాం..
నగరంలో కర్రీ పాయింట్లు, రైతుబజార్లు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మాంసం, చేపలు, కూరగాయల కర్రీలను అమ్ముతున్నారు. చాలా కేంద్రాల్లో మిగిలిన చికెన్, మాంసాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ చేసి మరుసటిరోజు వేడి చేసి విక్రయిస్తున్నారు. గతంలో బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు తనిఖీ చేయగా.. కుళ్లిపోయిన మాంసం, బూజుపట్టిన చేప ముక్కలు లభ్యమయ్యాయి.
ప్రజల ఆహార భద్రత కోసం నియమించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2011 వరకు బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బంది ఆహార కల్తీ నివారించేందుకు తనిఖీలు చేస్తుండే వారు. ఆ తదుపరి నిబంధనలతో ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు పర్యవేక్షించాలి. కానీ, ఫుడ్‌సేఫ్టీ అధికారుల కొరతతో ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తున్నారు. నమూనాలు సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. ఇక పరిశుభ్రతను తనిఖీ చేయాల్సిన బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆహార కల్తీపై హనుమకొండ జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదిస్తే అందుబాటులో లేరు.
వరంగల్ అర్బన్: కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆహారపదార్థాల నుంచి అలంకరణ వస్తువుల వరకు అన్నీ కల్తీమయమే. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది ప్యాపారులు చేస్తున్న ఈ దందా ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆహారపదార్థాల్లో కల్తీ నేరుగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని వెంటనే దుష్ప్రభావం చూపిస్తుండగా.. మరికొన్ని దీర్ఘకాలికంగా చేటుచేస్తున్నాయి. ఉరుకులు, పరుగుల జీవనంలో డబ్బులు ముట్టజెప్పి కడుపు నింపుకుంటూ అనేకమంది రోగాలను కొనుక్కుంటున్నారు. వరంగల్ మహానగరంలోని పలు హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, దాబాలు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్ల నిర్వాహకులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిషేధిత రసాయన పౌడర్లు, కల్తీ నూనెలు విచ్చలవిడిగా వాడుతున్నారు. అపరిశుభ్ర వాతావారణంలో వంటలు తయారు చేస్తున్నారు. నిర్వాహకులకు డబ్బు సంపాదన యావ తప్ప కనీస నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రతపై పట్టింపులేదు. బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది, ఆహార కల్తీ నియంత్రణ అధికారులు నెలవారీగా మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు వస్తే మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారు.
బిర్యానీ ఘుమఘుమలు..
ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అన్నట్లు భోజన ప్రియలు లోట్టలేసుకుంటూ చికెన్, మటన్ బిర్యానీ ఆరాగిస్తున్నారు. బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు కస్టర్లమర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. రంగు, రుచి, వాసన కోసం నిషేధిత పౌడర్లను ఉపయోగిస్తున్నారు. బిర్యానీలో వాడే చికెన్, మటన్ కూడా శుభ్రంగా ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా వాడే నూనెలు అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఎముకలు, కళేబారాల నుంచి తీసిన నూనెలు వాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ప్రముఖ బ్రాండ్ల పేరుతో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఆహార పదార్థాలను యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. వంట గదుల్లోకి వినియోగదారులు వెళ్లే అవకాశం లేదు. ఆ గదుల్లోకి నోఅడ్మిషన్ అని బోర్డులు పెడుతుండడంతో అవి రహస్య స్థావరాలుగా మారాయి. చాలా హోటళ్లలో గాలి, వెలుతురు కరువైంది. వడ్డించే వాళ్లు కనీసం చేతులకు గ్లౌజులు, నెత్తికి టోపీలు ధరించడం లేదు. ప్రజారోగ్య విభాగం, ఆహార కల్తీ నియంత్రణ అధికారులు హోటళ్లపై దాడులు చేసినప్పుడల్లా ఆశ్చర్యకర విషయాలు ఎన్నో వెల్లడవుతున్నాయి. వీటి వల్ల ప్రజలు ప్రమాదకర వ్యాధులబారిన పడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
పాడైపోయిన పదార్థాలతో తయారు చేస్తున్న నిర్వాహకులు
వంటల్లో నిషేధిత రసాయన పౌడర్లు, కల్తీ నూనెల వాడకం
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ, ఆహార కల్తీ నియంత్రణ శాఖ
నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్లలో పారిశుద్ధ్య తనిఖీలు చేస్తున్నాం. అపరిశుభ్రంగా ఉన్న వాటికి నోటీసులు జారీ చేసి, తదుపరి జరిమానా విధించి వసూలు చేస్తున్నాం. ఆహార కల్తీ తనిఖీ మాది కాదు. – రాజారెడ్డి, సీఎంహెచ్‌ఓ
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026


