ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం

Mar 2 2026 8:55 AM | Updated on Mar 2 2026 8:55 AM

ముగిస

ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ముప్పిడి సాంబయ్య అలియాస్‌ సుదర్శన్‌ అలియాస్‌ జంగ్‌ దాదా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయిడిసి, బాయిడిసి.. నాన్ననిడిసి సాయుధ బాట పట్టిన మావోయిస్టు నేత మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తుపాకీ ఎత్తి రాజీలేని ఉద్యమాన్ని సాగించిన ముప్పిడి సాంబయ్య ఆదివారం జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, దండకారణ్య డివిజన్‌ కమిటీ నేతగా ఉన్న ఆయన తన 14 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారన్న వార్త చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన సాంబయ్య సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు.

పదో తరగతి చదువుతున్నప్పుడే

ఉద్యమం వైపు..

ముప్పిడి సాంబయ్య 1984లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వరంగల్‌ ఉద్యమ పితామహుడు, వరంగల్‌ జిల్లా కార్యదర్శి పులి అంజన్నను స్ఫూర్తిగా తీసుకొని 1984లో పూర్తిస్థాయి కార్యకర్తగా పార్టీలో చేరారు. మొదట పరకాల ఏరియా దళసభ్యుడిగా, కొద్ది రోజులకే బాబన్న పేరుతో పరకాల – చిట్యాల ఏరియా కమాండర్‌గా వ్యవహరించారు. పరకాల కమాండర్‌ నుంచి ఖమ్మం జిల్లాకు జిల్లా కమిటీ సభ్యుడిగా బదిలీ అయ్యి 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 తర్వాత 2018 వరకు ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తూర్పు ఇన్‌చార్జ్‌గా భాస్కర్‌ పేరుతో వ్యవహరించారు. 2018లో ఒడిశా స్టేట్‌ కమిటీ మెంబర్‌గా వ్యవహరించారు. 2025లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి స్థానంలో ఒడిశా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. కాగా, 2013లో కమాండర్‌ స్థాయి అయిన నిమ్మల సారమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వివాహం జరగగా ప్రస్తుతం ఆమె జనగామలో ఉంటున్నట్లు పోలీసుల సమాచారం.

వికాస్‌, జంగ్‌ దాదా ఆయనే..

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేసిన సాంబయ్య.. వికాస్‌, జంగ్‌ దాదా పేర్లతో కూడా పనిచేసి పాపులర్‌ అయ్యారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుడు, కార్యదర్శిగా పనిచేసినప్పుడు సుదర్శన్‌, వికాస్‌ పేర్లతో వ్యవహరించారు. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో జంగ్‌ దాదాగా ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాంబయ్య తల్లిదండ్రులు రామస్వామి–భద్రమ్మ కాగా.. ప్రస్తుతం భద్రమ్మ ఉంది. సాంబయ్య కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా.. ఒక సోదరుడు సదానందం ప్రభుత్వ టీచర్‌.

ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, అనుచరులు

కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య

పులి అంజన్న స్ఫూర్తితో 42 ఏళ్ల క్రితం ఉద్యమ బాట

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో పనిచేసిన సాంబయ్య

ఉమ్మడి వరంగల్‌ నుంచి మిగిలింది నరహరి, పాండునే..

ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం1
1/2

ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం

ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం2
2/2

ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement