హాట్‌ హాట్‌గా మిర్చి | - | Sakshi
Sakshi News home page

హాట్‌ హాట్‌గా మిర్చి

Mar 2 2026 8:55 AM | Updated on Mar 2 2026 8:55 AM

హాట్‌ హాట్‌గా మిర్చి

హాట్‌ హాట్‌గా మిర్చి

ఏ మిర్చి ధర ఎంతంటే.. (రూ.ల్లో)

రకం ధర

దేశీ మిర్చి 50,000

ఎల్లో మిర్చి 42,000

వండర్‌హాట్‌ 39,000

సింగిల్‌ పట్టి 35,000

దీపిక 31,000

యూఎస్‌–341 29,000

1048 21,000

తేజ 20,600

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు హాట్‌ హాట్‌గా ఉంటున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని రకాల మిర్చికి ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు తాజాగా దేశీ మిర్చి క్వింటాలు రూ.50,000 పలకడంతో మిర్చి ధరలపై మరోసారి చర్చ జరుగుతోంది. మూడు రోజుల క్రితం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పుల్లూరుపల్లికి చెందిన రవీందర్‌రావు 9 బస్తాల దేశీ మిర్చిని తీసుకురాగా.. అడ్తి శాంతి ఇండస్ట్రీస్‌ అమ్మించగా రూ.50,000 ధర పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి సాగు విస్తీర్ణం తగ్గి, అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో ఉన్న మిర్చికే రేటు అధికంగా పలుకుతోందని, అదే సమయంలో ఆయా మిర్చి కారం, నాణ్యతను బట్టి పరిశ్రమలు ఎక్కువ ధరకు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తుండడం కూడా రేటు పెరగడానికి మరో కారణంగా ఉందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఈసారి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. మిర్చి నాటే సమయానికి కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి రాకపోవడంతో మార్కెట్‌కు మిర్చి రావడం తగ్గింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. గృహ అవసరాలకు వినియోగం పెరగడం, మార్కెట్‌కు మేలు రకమైన మిర్చి వస్తుండడంతో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు.

డిమాండ్‌ ఎందుకు ఎక్కువంటే..

● అకాల వర్షాలు, తామర తెగులుతో దేశీ రకం దిగుబడి పడిపోయింది. అదే సమయంలో ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడుతుండడంతో ధర పలుకుతోంది.

● సింగిల్‌ పట్టి మిర్చిని ఎక్కువగా పచ్చళ్లకు వినియోగిస్తున్నారు. ఘాటు ఉండకుండా టేస్టీగా ఉండడంతో దీనికి డిమాండ్‌ ఉంది.

● వండర్‌హాట్‌ మిర్చిలో కారం ఎక్కువ శాతం ఉంటుంది. పచ్చడి, పొడి మసాలా తయారీలో డిమాండ్‌ ఉంటుంది. తేజ మిర్చికి కూడా స్థానిక పరిశ్రమలు, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉంది.

ఏనుమాముల మార్కెట్‌లో మిర్చి ధరలు ౖపైపెకి

రోజురోజుకూ పెరుగుతున్న దేశీ, వండర్‌హాట్‌ ధరలు

ఇతర రకాల మిర్చికి సైతం మార్కెట్‌లో డిమాండ్‌

దేశీ మిర్చికి అత్యధికంగా క్వింటాకు రూ.50,000

జనవరి నుంచి ఇప్పటివరకు 1,27,200ల క్వింటాళ్ల విక్రయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement