సిబ్బంది సంక్షేమానికే ఫిల్లింగ్‌ స్టేషన్‌: డీజీపీ | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది సంక్షేమానికే ఫిల్లింగ్‌ స్టేషన్‌: డీజీపీ

Mar 2 2026 8:55 AM | Updated on Mar 2 2026 8:55 AM

సిబ్బంది సంక్షేమానికే ఫిల్లింగ్‌ స్టేషన్‌: డీజీపీ

సిబ్బంది సంక్షేమానికే ఫిల్లింగ్‌ స్టేషన్‌: డీజీపీ

సిబ్బంది సంక్షేమానికే ఫిల్లింగ్‌ స్టేషన్‌: డీజీపీ

వరంగల్‌ క్రైం: పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం మడికొండలోని పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కమిషనరేట్‌ పరిధి వివిధ పోలీస్‌ స్టేషన్లు, విభాగాల అధికారిక వాహనాల ఇంధన అవసరాల ను ఈ ఫిల్లింగ్‌ స్టేషన్‌ తీర్చనున్నట్లు ఆయన తెలి పారు. ఇంధన సరఫరాలో నాణ్యత నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌, డీసీపీలు కవిత, అంకిత్‌ కుమార్‌, ఏఎస్పీ శుభం, అదనపు ఏసీపీలు సురేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఎంటీ ఏసీపీ అంతయ్య, సురేంద్ర ఉన్నారు.

పోలీస్‌ అతిథి గృహం ప్రారంభం

కమిషనరేట్‌ పరిధిలో మరమ్మతులు చేసిన పోలీస్‌ అతిథి గృహాన్ని డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. హనుమకొండ పోలీస్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న డీజీపీకి సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం డీజీపీ మాట్లాడారు. పోలీస్‌ శాఖ అధికారుల, అతిథుల సౌకర్యాలను మెరుగుపర్చేలా ఈ అతిథి గృహాన్ని పునర్నిర్మించినట్లు తెలిపారు. డీసీపీలు అంకిత్‌ కుమార్‌, కవిత, శుభం నాగ్‌, అదనపు డీసీపీలు రవి, శ్రీనివాస్‌, సురేశ్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement