ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలిని కలిసిన స్వర్ణ | - | Sakshi
Sakshi News home page

ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలిని కలిసిన స్వర్ణ

Mar 8 2026 7:12 AM | Updated on Mar 8 2026 7:12 AM

ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలిని కలిసిన స్వర్ణ మంజూరు పత్రాల అందజేత 17 మంది మాల్‌ప్రాక్టీస్‌

వరంగల్‌: అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు ఆల్కా లాంబాను టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ శనివారం న్యూఢిల్లీలోని కార్యాలయంలో కలిశారు. పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా లాంబా.. తెలంగాణలో మహిళా విభాగాన్ని పటిష్టం చేయాలని సూచించినట్లు స్వర్ణ తెలిపారు.

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌జోన్‌ పరిధిలోని కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరస్వామి దేవాలయంలో పదవీ విరమణ పొందిన జూనియర్‌ అసిస్టెంట్‌ పవన్‌కుమార్‌, ప్రధానార్చకుడు కృష్ణమూర్తికి అర్చక సంక్షేమ నిధినుంచి రూ.8లక్షలు మంజూరయ్యాయి. ఆ మంజూరు పత్రాలను శనివారం హనుమకొండలోని రాంనగర్‌లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వారికి అందజేశారు. కార్యక్రమంలో వరంగల్‌ జోన్‌ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ సునీత పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ ఐదవ సెమిస్టర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం హనుమకొండలోని వివిద ఫార్మసీ కళాశాలల కేంద్రాల్లో కాపీయింగ్‌ చేస్తూ పట్టుబడిన 17 మంది విద్యార్థులను మాల్‌ప్రాక్టీస్‌ కింద బుక్‌ చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ తెలిపారు. నగరంలోని శివాని ఫార్మసీ కళాశాల కేంద్రంలో నలుగురు, వాగ్దేవిలో నలుగురు, సహస్ర కేంద్రంలో 9మందిని బుక్‌ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా వరంగల్‌ ఎల్‌బీ కాలేజీ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో ఒకరు కాపీయింగ్‌ చేస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement