అన్ని రంగాల్లో మహిళల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో మహిళల ప్రతిభ

Mar 6 2026 8:00 AM | Updated on Mar 6 2026 8:00 AM

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

మహిళా గెజిటెడ్‌ అధికారులకు క్రీడా, సాంస్కృతిక పోటీలు

హన్మకొండ అర్బన్‌: మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని, వారి ప్రతిభను ప్రోత్సహించే వేదికలుగా క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లోని టీజీఓ భవనన్‌లో మహిళా గెజిటెడ్‌ అధికారులకు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీలను కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో మహిళా అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు శనివారం నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్‌ రావు, ఆకవరం శ్రీనివాస్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, కార్యదర్శి పీఎస్‌ ఫణికుమార్‌, సంజీవరెడ్డి, రాజేశ్‌కుమార్‌, మాధవరెడ్డి,. మహిళా వి భాగం ప్రతినిధులు మాధవి, భాగ్యలక్ష్మి, కృష్ణవేణి, శ్రీప్రియ, పవిత్ర, మాలతి, హేమలత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement