వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల అధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ, హనుమకొండ ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఎదగాలని, హక్కుల సాధించుకోవాలి తప్ప అడుక్కోవద్దని సూచించారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాలకుపైగా వృత్తిలో కొనసాగుతున్న పలువురు మహిళా న్యాయవాదులను శాలువాలతో సత్కరించారు. ఏసీబీ కోర్టు జడ్జి క్షమాదేశ్ పాండే, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.రామలింగం, ఉభయ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, మహిళా కార్యదర్శులు నాగేంద్ర, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు.


