● వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై స్పష్టమైన సమాచారం సేకరించి నివేదికలు సిద్ధం చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై 99 రోజుల ప్రగతిని సమగ్రంగా నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నక్కలపల్లిలో పర్యటన
ఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం రన్‌వే విస్తరణలో భాగంగా నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ ఇక్బాల్, సర్వే అధికారులతో కలిసి కలెక్టర్ సత్యశారద గురువారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను కలెక్టర్ పరిశీలించారు.


