హైర్‌ బస్‌ డ్రైవర్ల నూతన వేతన ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

హైర్‌ బస్‌ డ్రైవర్ల నూతన వేతన ఒప్పందం

Mar 4 2026 7:12 AM | Updated on Mar 4 2026 7:12 AM

నర్సంపేట: ఆర్టీసీ హైర్‌ బస్‌ డ్రైవర్ల జీతభత్యాల విషయంలో యజమానులు, డ్రైవర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు నూతన వేతన ఒప్పందం చేసుకున్నట్లు ఆర్టీసీ హైర్‌ బస్‌ వరంగల్‌ జిల్లా ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగిశెట్టి ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు పట్టణంలో కార్మికులు, యజమానులకు మధ్య మంగళవారం చర్చలు జరిగి నూతన ఒప్పందం అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగిశెట్టి ప్రసాద్‌ మాట్లాడుతూ పల్లెవెలుగు డ్రైవర్‌కు 15 రోజులకు రూ.18,500, ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌కు 15 రోజులకు రూ.20,500, టెంపరరీ డ్రైవర్‌కు పల్లె వెలుగు బస్సుకు ఒక రోజుకు రూ.1,250, ఎక్స్‌ప్రెస్‌ టెంపరరీ డ్రైవర్‌కు ఒక్క రోజుకు రూ.1,400, దసరా పండుగా సందర్భంగా ఒక సంవత్సరం సీనియారిటీ ఉన్న ప్రతీ డ్రైవర్‌కు బోనస్‌గా రూ.2 వేలు, క్లీనర్‌కు 30 రోజులకు వేతనం రూ.4,500 ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లక్కం ప్రభాకర్‌, దినేష్‌, రవీందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నల్ల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement