దిక్కుతోచని స్థితిలో మొక్కజొన్న రైతులు
సాక్షి ప్రతినిధి, వరంగల్:
మొక్కజొన్నల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. మార్క్‌ఫెడ్ చాలా చోట్ల ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. ఫలితంగా సిండికేట్‌గా మారిన ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్‌లో ఇష్టారాజ్యంగా మొక్కజొన్నలు కొంటున్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 కనీస మద్దత ధర (ఎంఎస్‌పీ)ని ప్రకటించింది. మొక్కజొన్నల కొనుగోలు విషయంలో మార్క్‌ఫెడ్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు దూరంగా ఉన్నాయి. దీంతో ఖరీఫ్‌లో ఎలాగోలా గండం గట్కెక్కించుకున్న మొక్కజొన్న రైతులకు ఈ యాసంగిలో వ్యాపారులు చుక్కలు చూపెడుతున్నారు. క్వింటాకు రూ.1,850 నుంచి రూ.1,950 మించి ధర ఇవ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
2.11 లక్షల ఎకరాల్లో సాగు..
2025–26 యాసంగి సీజన్‌కు సంబంధించి విత్తనాల వేసే నుంచి ఫిబ్రవరి–మే మధ్య వరకు సాగు నమోదు ఆధారంగా 2,11,500 ఎకరాల్లో మొక్కజొన్న వేసినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ సాగు ఆధారంగానే ఒక్కో ఎకరానికి వాతావరణ పరిస్థితుల ఆధారంగా 28 క్వింటాళ్ల నుంచి 32 వరకు వస్తుందనేది అంచనా. ఈ లెక్కన 5.92 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.78 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు దిగుబడి రావొచ్చని భావించి ఆ మేరకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ సహా ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ మేరకు కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులే వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు నేరుగా గ్రామాలకు వెళ్లి అగ్గువకు కొంటున్నారు. దీంతో ‘లాభాల మాట దేవుడెరుగు కానీ ఇంటిల్లిపాది కష్టపడినప్పటికీ తమ పె ట్టుబడులు పోను రెక్కల కష్టం కూడా మిగిలడం లే దు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.28,000 నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తే.. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ.18.200 నుంచి రూ.23,000 వరకే మిగిలితే అ ప్పులు, వడ్డీలకే సరిపోతున్నాయని చెబుతున్నారు.
2025–26లో జిల్లాల వారీగా
మొక్కజొన్న సాగు విస్తీర్ణం..
మొక్కజొన్న వ్యాపారుల ‘సిండికేట్’..
క్వింటాకు రూ.1,950 దాటని పరిస్థితి
ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.2,400..
‘కనీస మద్దతు’ కోసం ఎదురుచూపులు
ఉమ్మడి వరంగల్‌లో 2.11 లక్షల
ఎకరాల్లో సాగు.. 7.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక
రైతుల ఆందోళన
ఖర్చు అంశం సుమారు ఖర్చు
రూ.లు)
భూమి దున్నడం, సిద్ధం చేయడం 4,000 – 6,000
విత్తనాలు (హైబ్రిడ్) 3,000 – 4,000
ఎరువులు 5,000 – 7,000
మందులు (కీటక నివారణ) 3,000 – 5,000
కూలీల ఖర్చు 6,000 – 8,000
నీటి ఖర్చు 3,000 – 5,000
కోత – రవాణా 4,000 – 6,000
మొత్తం ఖర్చు 28,000 – 40,000
జిల్లా సాగు విస్తీర్ణం
( ఎకరాల్లో...)
హనుమకొండ 58,000
వరంగల్ 46,000
జనగామ 30,150
మహబూబాబాద్ 40,230
ములుగు 20,125
జేఎస్ భూపాలపల్లి 16,995
మొత్తం 2,11,500


