కాంట్రిబ్యూషన్‌ ఒక శాతానికి పరిమితం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రిబ్యూషన్‌ ఒక శాతానికి పరిమితం చేయాలి

Mar 6 2026 8:00 AM | Updated on Mar 6 2026 8:00 AM

ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ పర్సన్స్‌

అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సీతారాం

హన్మకొండ: ఈహెచ్‌ఎస్‌ కాంట్రిబ్యూషన్‌ ఒక శాతానికే పరిమితం చేయాలని, ఒక శాతానికి మించితే ప్రత్యక్ష పోరాటంతో పాటు న్యాయ పోరాటాలు చేస్తామని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం అన్నారు. గురువారం హనుమకొండ స్నేహనగర్‌లో అసోసియేషన్‌ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూపురాణి సీతారాం మాట్లాడుతూ.. తమ అసోసియేషన్‌ మొదటి నుంచి కాంట్రిబ్యూషన్‌ను వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజల, ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. పెన్షనర్లు, ఉద్యోగులు ప్రజలలో భాగమని, ప్రజలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ వంటి పథకం ద్వారా పెన్షనర్లకు, ఉద్యోగులకు వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణగిరి వీరన్న, అసోసియేషన్‌ నాయకులు జె.ప్రభాకర్‌రెడ్డి, బేతి శంకర్‌ లింగం, ఆర్తి సంపత్‌ కుమార్‌, పరికిపండ్ల వేణు, దేవులపల్లి ఎర్రగట్టు స్వామి, కుడికాల సదానందం, పోశాల కుమారస్వామి, కాంతాల లక్ష్మారెడ్డి, మెంచు వెంకన్న, గజవెల్లి పద్మకుమారి, కాట్రపెల్లి వేణుగోపాల్‌, కన్నోజు దేవేంద్రాచారి, కందికొండ సదానందం, ఆకుతోట మహేందర్‌, రహమాన్‌, దాసరి సుమతి, కొత్త కనకయ్య, కానుగంటి సుభాశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement