డ్రెయినేజీలో నల్లా కనెక్షన్లు
వరంగల్: వరంగల్ 19వ డివిజన్ వివేకానందకాలనీ రోడ్డు–2లో డ్రెయినేజీలోనే తాగు నీటి నల్లా కనెక్షన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాలనీలో డ్రెయినేజీల నిర్మాణంలో భాగంగా పాత పైపులైన్ తీసివేశారు. కాల్వ మధ్యలో పైపులైన్ వేసి కనెక్షన్లు ఇవ్వడంపై కాలనీవాసులు అభ్యంతరం చెబుతున్నారు. కాల్వ మధ్యలో ఉన్న పైపుపై సిమెంట్, కాంక్రీట్ వేస్తామని ప్లంబర్ చెప్పగా.. భవిష్యత్‌లో లీకయితే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. తాగునీటి పైపులైన్‌ను మధ్య నుంచి పక్కకు జరిపి, సైడ్ డ్రెయిన్ గోడ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.


