రోగులకు మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

Mar 3 2026 7:15 AM | Updated on Mar 3 2026 7:15 AM

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

డీఎంహెచ్‌ఓ అప్పయ్య

ఎంజీఎం: సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలంచాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కొండపర్తి, ఐనవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆరోగ్య కేంద్రాల్లోని ఔట్‌ పేషెంట్‌ మందుల పంపిణీ, ఇతర రికార్డులు పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. మార్చి 31లోగా ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ పూర్తి చేయాలన్నారు. ఐనవోలు పీహెచ్‌సీలో 24/7 మాతా శిశు సేవలు అందించాలని, ఆస్పత్రులకు వచ్చిన రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకుంటే తగిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌, వైద్యాధికారి శ్యాంప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement