అర్జీలు వెంటనే పరిష్కరించేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు వెంటనే పరిష్కరించేలా చర్యలు

Mar 3 2026 7:15 AM | Updated on Mar 3 2026 7:15 AM

● కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. అలాగే, జిల్లాలోని పలువురు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి పెండింగ్‌ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 222 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్‌ రమేశ్‌, డాక్టర్‌ కన్నం నారాయణ, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement