గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఆర కట్ల సాయి భక్తులకు స్వాగతం పలుకుతూ ఏ ర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియన వ్యక్తులు సోమవారం రాత్రి చించివేసి తొలగించినట్లు స్థాని కులు తెలిపారు. మచ్చాపూర్ నుంచి కొమ్మాల ఆల య ముఖ ద్వారం వరకు సాయి తన అభిమాన నా యకులు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో స్థానిక పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటోలు లేకపోవడంతో ఆయన అభిమానులు దీన్ని తప్పుపట్టి, చించివేసినట్లు సమాచారం. ఈ విషయమై సాయి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతుండగా చించి వేసిన సదరు నాయకులు ఆయనకు క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. ఇనుగాల వెంకట్రాంరెడ్డి, దొంతి మాధవరెడ్డిల ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సొంత పార్టీ వారే చించివేయడం చర్చనీయాంశంగా మారింది.


