అడవుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

Mar 4 2026 7:12 AM | Updated on Mar 4 2026 7:12 AM

ఖానాపురం: అడవుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతని ఎఫ్‌ఆర్‌ఓ పుప్పాల రవికిరణ్‌ అన్నారు. ఈ మేరకు మండలంలోని పాకాల అటవీ ప్రాంతంలో మంగళవారం ప్రపంచ వణ్యప్రాణుల దినోత్సవ వేడుకలను చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణతోనే జంతు సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. జంతువులను వేటాడటం చట్టరిత్యా నేరమన్నారు. జంతువులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారులు ధర్మ, సిబ్బంది విజయ్‌, ప్రకాశ్‌, శ్రీకాంత్‌, మహేష్‌, రవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement