వరంగల్ స్పోర్ట్స్: ఈత సాధన చేసే విద్యార్థులు, యువతకు, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చి, వచ్చే నెల (ఏప్రిల్) 1వ తేదీన పునఃప్రారంబించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలోని డీఎస్‌ఏ స్విమ్మింగ్ పూల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులు వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ చాహత్ వెంట డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌బాబు, డీఎస్‌ఏ కోచ్‌లు రాయబారపు నవీన్, శ్రీమన్నారాయణ, రాజారపు రమేశ్, టీజీఐఐసీ అధికారులు ఉన్నారు.
కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
స్విమ్మింగ్‌పూల్ అభివృద్ధి పనుల పరిశీలన


