గీసుకొండ: రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు భేటీ అయ్యారు. మండలంలోని ఓ గార్డెన్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆమెను పలువురు సర్పంచ్‌లు శుక్రవారం కలిసి తమ పరిస్థితులను వివరించారు. రాంపురం సర్పంచ్, కొండా వర్గం నాయకుడు రడం భరత్ ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, మహిళా సర్పంచ్‌ల భర్తలు కొమ్ముల కమల భిక్షపతి, బానోతు రాఘవేంద్ర, కన్నెబోయిన యమున, కేలోతు అమృత భిక్షపతి, పేర్ల శ్రవణ్.. మంత్రికి తమ గ్రామాల సమస్యలను విన్నవించారు. గ్రామాల అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు రడం భరత్ తెలిపారు.
103 మంది ఇంటర్
విద్యార్థుల గైర్హాజరు
కాళోజీ సెంటర్: శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం వార్షిక పరీక్షలకు 103 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జనరల్ కోర్స్‌లో మొత్తం 3,647 మంది విద్యార్థులకు 3,579 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 765 మందికి 730 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు వివరించారు.
హనుమకొండ జిల్లాలో 307మంది..
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఒకరు కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డీబార్ అయ్యారు. జిల్లాలో మొత్తం ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 17,163 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. అందులో 307 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. కమలాపూర్ మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డీబార్ అయినట్లు ఆయన తెలిపారు.
ఈ ఆచార్యుడు ఆదర్శం
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో 100 శాతం విధులకు హాజరు హాజరై పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా ప్రొఫెసర్లు సెలవులను ఎక్కువగా వినియోగించుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో వంద శాతం హాజరు నమోదు చేసుకుని పలువురు వైద్యశాఖ ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకున్నారు.
వేయిస్తంభాల గుడిలో
సంకటహరచతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం దేవాలయంలోని ఉత్తిష్టగణపతికి అభిషేకాలు నిర్వహించారు.
‘గోల్’ సాధించారు
సివిల్స్ ఫలితాల్లో
మెరిసిన
జిల్లా అభ్యర్థులు
ఉత్తమ ర్యాంకులతో
కల సాకారం
చేసుకున్న యువకులు


