కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో ఎన్‌ఐజీఐఎస్‌టీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ) సర్వే ఆఫ్ ఇండియా మంగళవారం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ఎన్‌ఐజీఎస్‌టీ డైరెక్టర్, సీనియర్ అధికారి బీసీ ఫరీదా పరస్పరం ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐజీఎస్టీ ప్రతినిధులు నిత్యానందం, వెంకయ్యచౌదరి, నిట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
హసన్‌పర్తి: చంద్రగ్రహణంతో ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని రద్దు చేశారు. జాతరను పురస్కరించుకుని మంగళవారం ఉదయం హసన్‌పర్తి–భీమారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆతర్వాత స్వామి వారిని రథంపై ఎర్రగట్టుగుట్టకు చేర్చారు. మధ్యాహ్నం 12 గంటలలోపే స్వామి వారిని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆతర్వాత ఆయాన్ని ద్వారబంధనం చేశారు. చంద్రగ్రహణంతో ఈసారి స్వామివారి శోభాయాత్ర నిరాడంబరంగా సాగింది. బుధవారం మహాసంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రా రంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది.


