ముగ్గురు విద్యార్థుల డీబార్‌ | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు విద్యార్థుల డీబార్‌

Mar 5 2026 7:15 AM | Updated on Mar 5 2026 7:15 AM

నేటినుంచి పీజీకోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా జ్యోతి కొనసాగింపు

ఖానాపురం: ఇంటర్‌ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ చేస్తూ ముగ్గురు విద్యార్థులు డీబార్‌ అయినట్లు చీఫ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ బుధవారం తెలిపారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మండల కేంద్రంలోని జూనియర్‌ కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు. 148 మందికి 145 విద్యార్థులు హాజరయ్యారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సదానందం, ప్రకాశ్‌రాజ్‌ సెంటర్‌లో తనిఖీ చేసి ముగ్గురు విద్యార్థుల వద్ద చిట్టీలు ఉన్నట్లు గుర్తించారు. చిట్టీలను బయటకు తీసి మాల్‌ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు రాసి సెంటర్‌ అధికారులకు అప్పగించినట్లు రవికుమార్‌ తెలిపారు. ఇద్దరు విద్యార్థులు మోడల్‌ స్కూల్‌, ఒకరు స్థానిక కళాశాలకు చెందిన వారిగా గుర్తించారు. విద్యార్థుల మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి జవాబుపత్రాలను ఇంటర్‌ ప్రత్యేక బోర్డుకు పంపనున్నట్లు తెలిసింది.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గురువారం నుంచి పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం తదితర కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నట్లు బుధవారం పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పి.శ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 4,149 మంది విద్యార్థులకు 23 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌కళాశాల ప్రిన్సిపాల్‌గా జ్యోతి పదవీకాలాన్ని మరో సంవత్సరం కొనసాగిస్తూ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్‌గా జ్యోతి పదవీకాలం రెండేళ్లు పూర్తయ్యింది. సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న జ్యోతిని మరో సంవత్సరంపాటు కొనసాగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ యూనివర్సిటీలో జ్యోతికి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement