వైద్యం అందించరూ..
ఎంజీఎం: నగరంలోని 11వ డివిజనల్‌లో ఆదివా రం ఈద్గా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ఓ మహిళ తన కొడుకుకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సత్యశారదను వేడుకుంది. వివరాలి లా ఉన్నాయి.. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ఓ మహిళ తన కుమారుడు గుండెటి సతీష్ ఆదివారం ఉదయం కడుపునొప్పితో ఎంజీఎంకు రాగా ఓపీ స్లిప్‌తో చికిత్స అందించి మందులు ఇచ్చి పంపించారని, మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను వేడుకుంది. స్పందించిన కలెక్టర్ ఎంజీఎం ఆర్‌ఎంఓతో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు తన సీసీని ఎంజీఎంకు పంపించి చికిత్స అందించాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద చొరవపై అక్కడ ఉన్న ప్రతీఒక్కరు హర్షం వ్యక్తం చేశారు.
కలెక్టర్ సత్యశారదను వేడుకున్న మహిళ


