ముంబై: ఢిల్లీలో విద్యార్థి శౌర్య పాటిల్ మృతి ఘటన మరువక ముందే మహారాష్ట్రలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ఎనిమిదో తరగతి విద్యార్థిని(13) పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై సీఐ సందీప్ భారతీ తెలిపిన వివరాల ప్రకారం.. జల్నా నగరంలోని CTMK గుజరాతీ విద్యాలయంలో ఆరోహి దీపక్ బిట్లాన్(13) ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రతీరోజు మాదిరిగానే ఆమె.. శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అనంతరం, ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకింది. దీంతో, వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి తర్వాత.. సివిల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే బాధితురాలు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు.
మరోవైపు, బాధితురాలు తల్లిదండ్రులు తమ బిడ్డ మరణంపై మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నిరంతర వేధింపులు, చిత్రహింసల కారణంగానే మా కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. చాలా రోజులుగా ఆమె ఆవేదనతో ఉంది. కానీ, తను ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. మాకు న్యాయం కావాలి. మా బిడ్డను వేధించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇక, విద్యార్థిని మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. ఆమె మృతి విషాదకరమని అన్నారు. దీనిపై దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపారు. పోలీసులు తమ విచారణను పూర్తి చేసిన తర్వాతే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.
#WATCH | Jalna, Maharashtra: Sadar Police Inspector Sandeep Bharti says, "This morning, around 7:30-8 o'clock, information was received about a 13-year-old schoolgirl jumping from the school roof and committing suicide. Investigation is underway. Preliminary investigation is… pic.twitter.com/TqNohmAL0R
— ANI (@ANI) November 21, 2025


