హైవేపై ట్రాఫిక్‌ జామ్‌.. 500 మంది విద్యార్థులకు 12 గంటల నరకం.. | Massive 12-Hour Traffic Jam on Mumbai-Ahmedabad Highway – 500 Students Stranded Overnight | Sakshi
Sakshi News home page

హైవేపై ట్రాఫిక్‌ జామ్‌.. 500 మంది విద్యార్థులకు 12 గంటల నరకం..

Oct 15 2025 12:39 PM | Updated on Oct 15 2025 1:14 PM

Massive Jam On Mumbai-Ahmedabad Highway Students Stuck

ముంబై: మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై దాదాపు 12 గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, దాదాపు 500 మంది విద్యార్థులు హైవేపై ట్రాఫిక్‌లో చిక్కుకుని అ‍ల్లాడిపోయారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుమజాము వరకు ట్రాఫిక్‌ క్లియర్‌ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే, థానేలోని ఘోడ్‌బందర్ హైవేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.

వివరాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అదే సమయంలో పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు తమ ఇళ్లకు బయలుదేరారు. దీంతో, 5-10 తరగతులు విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. థానే, ముంబై వైపు నుంచి వస్తున్న వాహనాల రద్దీ కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. విద్యార్థులంతా ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు.

మంగళవారం సాయంత్రం నుంచి దాదాపు 12 గంటల పాటు ట్రాఫిక్‌ క్లియర్‌ కాకపోవడంతో విద్యార్థులంతా ట్రాఫిక్‌లోనే ఉన్నారు. దీంతో, స్థానికులు వారికి ఆహారం అందించారు. చాలా మందికి ఆహారం, నీరు అందకపోవడంతో ఆవేదన చెందారు. విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా రోడ్డుమీదే ఉన్నారు. ఈ కారణంగా వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న విద్యార్థుల చివరి బస్సు బుధవారం ఉదయం బయటకు వచ్చినట్టు పిల్లల పేరెంట్‌ ఒకరు చెప్పుకొచ్చారు.

వాహనాల రద్దీ కారణంగా పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, థానేలోని ఘోడ్‌బందర్ హైవేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. భారీ వాహనాలను మళ్లించడం వల్ల ఈ జామ్ ఏర్పడిందని.. దీని ఫలితంగా ముంబై-అహ్మదాబాద్ మార్గంలో అధిక ట్రాఫిక్ భారం ఏర్పడిందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement