విరాట్‌ కోహ్లీ, అనుష్క ఫెస్టివ్‌ వైబ్‌ : రూ. 38 కోట్ల ఆస్తి కొనుగోలు | Actress Anushka Sharma cricketer Virat Kohli Invest In Rs 38 Crore Alibaug Land | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లీ, అనుష్క ఫెస్టివ్‌ వైబ్‌ : రూ. 38 కోట్ల ఆస్తి కొనుగోలు

Jan 16 2026 7:18 PM | Updated on Jan 16 2026 7:24 PM

Actress Anushka Sharma cricketer Virat Kohli Invest In Rs 38 Crore Alibaug Land

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ  కు సంబంధించిన ఒక శుభవార్త  ప్రస్తుతం నెట్టింట సందడిగామారింది.  అలీబాగ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఐదు ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. సీఆర్‌ఈ (CRE) మ్యాట్రిక్స్ ఆస్తి పత్రాల ప్రకారం, దీని విలువ 37.86 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

మహరాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా (402201)లోని అలీబాగ్‌లోని గాట్ నంబర్లు 157  158లోని విలేజ్ జిరాద్‌లో  ఈ  భూమి ఉంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ప్రకారం, మొత్తం భూమి 21,010 చదరపు మీటర్లు లేదా దాదాపు 5.19 ఎకరాలు ఉంటుంది. ఈ లావాదేవీ జనవరి 13, 2026న రిజిస్టర్ చేశారు. సోనాలి అమిత్ రాజ్‌పుత్ నుంచి అనుష్క, విరాట్ దంపతులు ఈ భూమిని కొనుగోలు చేసినట్టు CRE మ్యాట్రిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ కిరణ్ గుప్తా వెల్లడించారు.  నిబంధనల ప్రకారం విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.1,000గా నమోదయ్యాయి. 

ఇదీ చదవండి: పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనం

మరోవైపు సెలబ్రిటీ జంట విరుష్క అలీబాగ్‌లో ఇదే తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు. 2022లో, ఈ జంట 2022లో అలీబాగ్‌లో 19.24 కోట్ల రూపాయలకు దాదాపు 8 ఎకరాలు కొనుగోలు చేశారు. తరువాత ఈ జంట సంపాదించిన ప్లాట్లలో ఒక విలాసవంతమైన వెకేషన్ హోమ్‌ను నిర్మించారు. ఇదే ప్రాంతంలో ల్యాండ్‌ను కొనుగోలు చేసినవారిలో  ప్రముఖ కొనుగోలుదారులలో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా ఉన్నారు. గత ఏడాది  సెప్టెంబర్ 2025లో చాటౌ డి అలీబాగ్‌లో సుమారు రూ. 2 కోట్ల విలువైన 2,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అలాగే బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడి పెట్టారు. 2024 ఏప్రిల్‌లో రూ. 10 కోట్లకు 10,000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు, ఆ తర్వాత అక్టోబర్ 2025లో రూ. 6.6 కోట్లకు మొత్తం 9,557 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు ఆనుకుని ఉన్న ప్లాట్లను కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా అలీబాగ్‌లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ప్రముఖులలో  ఉండటం విశేషం.
ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement