క‌లిసి క‌నిపించారు.. ఇక అంతే! | Bhumi Pednekar Aditya Thackeray Clicked Together At Mumbai Restaurant | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్‌లో భూమి పడ్నేకర్, ఆదిత్య ఠాక్రే

Nov 7 2025 2:59 PM | Updated on Nov 7 2025 3:22 PM

Bhumi Pednekar Aditya Thackeray Clicked Together At Mumbai Restaurant

బాలీవుడ్ న‌టి భూమి ప‌డ్నేకర్, మహారాష్ట్రకు చెందిన యువ‌ రాజకీయ నేత ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే ఓ రెస్టారెంట్‌లో క‌లిసి క‌నిపించారు. ఇంకేముంది వారిద్ద‌రూ క‌లిసివున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ (Viral) అయ్యాయి. వారిద్దరి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌న్న గుస‌గుస‌లు మొద‌లైపోయాయి. జ‌నాలు ఊహించిన‌ట్టుగా వారిద్ద‌రి మ‌ధ్య ఏం లేద‌ని తెలుస్తోంది.

మంగళవారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలోని ఒక రెస్టారెంట్‌లో భూమి పడ్నేకర్, ఆదిత్య ఠాక్రే (Aditya Thackeray) క‌లిసి క‌నిపించారు. వీరిద్ద‌రితో పాటు మరికొందరు స‌న్నిహితులు కూడా ఉన్నారు. కాబ‌ట్టి వారిద్ద‌రూ డేట్‌కి వెళ్లలేద‌ని క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతుంది. వీళ్లంతా ఎందుకు రెస్టారెంట్‌లో క‌లిశారనే ప్ర‌శ్న‌కు స‌మాధానం కూడా ఉంది.

యంగ్ గ్లోబల్ లీడర్స్ (YGL) సభ్యుల కోసం భూమి పడ్నేకరే (Bhumi Pednekar) ఈ విందు ఏర్పాటు చేసింద‌ట‌. ఆదిత్య ఠాక్రే, క్రిస్టర్ క్జోస్‌లతో పాటు ప‌లువురు ఈ విందులో పాల్గొన్నారు. పార్టీ ముగిసిన త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌స్తున్న క్ర‌మంలో మీడియా ప్ర‌తినిధులు వీరి వెంట‌ప‌డ్డారు. ఇదీ అస‌లు విష‌యం. భూమి, ఆదిత్య‌ను ఒకే చోట చూసి జ‌నాలు మాత్రం ఏదేదో ఊహించేసుకుంటున్నారు.

మొదటి భారతీయ నటి
భూమి ప‌డ్నేకర్ గురించి చెప్పాలంటే ఆమె న‌టకు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. వాతావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు త‌న వంతు పాటుప‌డుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీలో సభ్యురాలిగా కూడా ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో, జెనీవాలో జరిగిన యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంది. ఈ ఘ‌న‌త సాధించిన మొదటి భారతీయ నటిగా ఆమె నిలిచింది.

చూడండి: 'ది ఫ్యామిలీ మ్యాన్-3' యాక్షన్‌ ట్రైలర్‌

ఇమ్రాన్ ఖాన్‌తో మూవీ
ఇక సినిమాల విష‌యానికొస్తే.. ఇమ్రాన్ ఖాన్‌తో క‌లిసి ఒక మూవీ చేస్తోంది. ఈ సినిమా 2026 ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుందని సమాచారం. ప‌దేళ్ల‌కు పైగా న‌ట‌న‌కు దూరంగా ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మ‌ళ్లీ ఈ చిత్రంతో పున‌రాగ‌మ‌నం చేస్తున్నాడు. 2015లో విడుద‌లైన 'క‌ట్టి బ‌ట్టి' త‌ర్వాత చేస్తున్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. భూమి ప‌డ్నేక‌ర్ న‌టించిన 'మేరే హస్బెండ్ కీ బీవీ' ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement