
ప్రముఖ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రస్తుతం దల్దాల్ అనే వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో మెప్పించనుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఈ ఏడాది మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో మెప్పించిన బ్యూటీ.. ఇప్పుడు ఓటీటీ సిరీస్లతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ముంబయిలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్కు హాజరైన బాలీవుడ్ భామ మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్పై మాట్లాడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలే లక్ష్యంగా ట్రోల్స్ చేస్తున్నారని.. వీటిని ఎదుర్కోవడంతో ఉమెన్స్ ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.
భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ.. "ట్రోలింగ్.. బెదిరింపులు.. దీన్ని మీరు ఏ విధంగా పిలిచినా.. మనం దానికి అలవాటు పడ్డాం. కానీ మహిళలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు. ఎందుకంటే నాకు అంత ధైర్యం లేదు. ఇంకో మార్గం లేనందున నన్ను నేనే సర్ది చెప్పుకుంటా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. నాపై వచ్చే ట్రోల్స్ను ఎలాగైనా తట్టుకోగలగనని తెలుసుకున్నా" అని తెలిపింది.
సోషల్ మీడియా ఆధిపత్యం చెలాయించే ఈ రోజుల్లో జీవించడం నిరంతరం భిన్నమైన అభిప్రాయాలను తీసుకొస్తుందని తెలిపింది. నా జీవితంలో పరిస్థితులు నాకు చాలా ఎక్కువగానే నేర్పించాయని గుర్తు చేసుకుంది. తన తొలి చిత్రం దమ్ లగా కే హైషా సినిమా తన జీవితాన్ని మార్చేసిందని భూమి తెలిపింది. టీనేజ్ వయసులో ఉన్నప్పుడే హీరోయిన్ కావాలనే పెద్ద కలతో నా ప్రయాణాన్ని ప్రారంభించానని పేర్కొంది. అప్పట్లో అవకాశాల కోసం వేచి చూసేదాన్ని అని వెల్లడించింది. కానీ ఈ రోజు నా లక్ష్యంతో పాటు ఒక వ్యక్తిగా అభివృద్ధి చెందానని భూమి పెడ్నేకర్ పంచుకుంది. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే భూమి చివరిసారిగా ది రాయల్స్‌లో అనే వెబ్ సిరీస్లో కనిపించింది.