నేచురల్‌ బ్యూటీ లుక్‌ : సీక్రెట్‌ షేర్‌ చేసిన బాలీవుడ్‌ బ్యూటీ | Bhumi Pednekar shares traditional skincare here is secret | Sakshi
Sakshi News home page

నేచురల్‌ బ్యూటీ లుక్‌ : సీక్రెట్‌ షేర్‌ చేసిన బాలీవుడ్‌ బ్యూటీ

Jun 23 2025 3:29 PM | Updated on Jun 23 2025 5:18 PM

Bhumi Pednekar shares traditional skincare here is secret

బాలీవుడ్‌ బ్యూటీ భూమి పెడ్నేకర్ మెరిసే చర్మం కోసం అద్భుతంగా పనిచేసే సాంప్రదాయ చిట్కాను షేర్‌  చేసింది. సెల్ఫ్‌ కేర్‌ సండే అంటూ తన రొటీన్‌  స్కిన్‌ కేర్‌ గురించి ఇన్‌స్టాలో పేర్కొంది.  అలాగే తన మెరిసే చర్మం,  అందం రహస్యాన్ని అభిమానులకు  ఈ పోస్ట్‌ ద్వారా వివరించింది. దీనికి సంబంధించి కొన్ని అందమైన ఫోటోలను కూడా ఇన్‌స్టాలో  పోస్ట్‌   చేసింది. 

హై-ఫ్యాషన్ అప్పీరియన్స్ కు పేరుగాంచిన  భూమి పెడ్నేకర్ ప్రస్తుతం ‘ది రాయల్స్ సిరీస్’ విజయాన్నిఆస్వాదిస్తోంది. తాజాగా ముల్తానీ మిట్టి మాస్క్‌ తయారు చేసే వీడియెను, "సెల్ఫ్-కేర్ సండే" అనే క్యాప్షన్తో ఆమె చేతిలో గులాబీని పట్టుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

 

ముల్తానీ మిట్టి - ప్రయోజనాలు 
 

  • సౌందర్య పోషణలో పురాతకాలంనుంచీ ముల్తానీ మట్టికి ఎంతో  ప్రాధాన్యత ఉంది. జిడ్డు, లేదా మొటిమల బారిన పడే చర్మానికి ఇది మేలు చేస్తుంది.

  • మృత కణాలను తొలగిస్తుంది. లోతుగా శుభ్రపర్చి, అదనపు నూనెను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. చర్మాన్ని టైట్‌గా చేసి, వృద్ధాప్యల లక్షణాలను తొందరగా దరిచేరనీయదు. 
     

  • దీంట్లోని సున్నితమైన ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు నల్ల మచ్చలను పోగొట్టడానికి, పిగ్మెంటేషన్‌ను తగ్గించి, ఆరోగ్యకరమైన, ప్రకాశ వంతమైన మెరుపును అందించడానికి సాయపడతాయి. 

  • అలాగే ముల్తాని మట్టిలోని సహజ శీతలీకరణ ప్రభావం ఎండ ప్రభావంతో వచ్చిన మచ్చలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.

  • యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, ఆయిల్‌ను నియంతరించే లక్షణాలు కారణంగా ఇది మొటిమలు ఎక్కువగా వచ్చేవారికి ఇది బాగా పనిచేస్తుంది.

ఇదీ చదవండి: భారతీయ సంతతి ర్యాపర్‌ ఓవర్‌ యాక్షన్‌ : నెటిజన్ల తీవ్ర అగ్రహం

ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి:

ముల్తానీ మిట్టి పొడిని రోజ్ వాటర్ లేదా సాదా నీటితో కలిపి మృదువైన పేస్ట్ లా చేయండి. దీన్ని మీ ముఖానికి  అప్లై చేసి, 15-20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. స్కిన్‌ తత్వాన్ని బట్టి పెరుగు, తేనె లేదా బాదం పాలను కూడా జోడించవచ్చు. (‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు)

నోట్‌ :  ఆధునిక కాలంలో బ్యూటీ   ప్రొడక్ట్స్‌లో ముల్తాని మట్టిని విరివిగా వాడతారు. అయితే ముందుగా వేసుకునే వారు ప్యాచ్‌ టెస్ట్‌ వేసుకోవడం మర్చిపోవద్దు. ఒక వేళ  ఏదైనా  అలర్జీలాంటిది వస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

Advertisement
 
Advertisement
Advertisement