
ఈ మధ్య సినిమాల్లో రొమాన్స్ ఎక్కువైపోయింది. ముద్దు సీన్స్ లేని సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్‌లలో అయితే మోతాదుకు మించిన రొమాన్స్ చూపిస్తున్నారు. హీరోయిన్లు కూడా అలాంటి సన్నివేశాలకు నో చెప్పడం లేదు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాలు అయినా చేయడానికి రెడీ అంటూ ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. అంతేకాదు అలాంటి సన్నివేశాలు వివాదస్పదంగా మారితే..వాటిని సమర్థిస్తూ చిత్రబృందానికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) కూడా అదే పని చేశారు. ఆమె నటించిన ‘ది రాయల్స్’(The Royals ) వెబ్ సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అందులో హీరో ఇషాన్(Ishaan Khatter), భూమిల మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇషాన్ వయసులో తనకంటే ఆరేళ్లు చిన్నవాడైనా.. ఇంటిమేట్ సీన్స్ చేసింది. దీంతో పలువురు నెటిజన్స్ భూమి పెడ్నేకర్‌ని విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్ చేశారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన క్లిప్పులను పోస్ట్ చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు.
తాజాగా ఈ సన్నివేశాలపై భూమి ఫెడ్నేకర్ స్పందించింది. ‘వయసులో చిన్నవాడు అయితే ఏంటి? తనతో కంఫర్ట్‌గా అనిపించింది కాబట్టే..ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేశాను’ అని చెప్పుకొచ్చింది. ‘ఇంటిమేట్ సీన్స్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి సన్నివేశాల్లో ఇమిడిపోయి నటించాలి. ఇద్దరికి కంఫర్ట్‌గా లేకపోతే ఆ సీన్ ఫేక్‌గా ఉంటుంది. అందుకే షూటింగ్‌కి ముందే మేం వర్క్‌షాప్ చేశాం. ఒకరి గురించి ఒకరం తెసుకున్నాం. ఇద్దరం బాగా క్లోజ్ అయిన తర్వాతే ఆ సీన్స్‌లో నటించాం. నాకు కంఫర్ట్‌గా అనిపించింది కాబట్టే అతనితో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేశా’ అని భూమి చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ది రాయల్స్ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఇదొక రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్. ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. మోర్పూర్ రాయల్ కుటుంబం చుట్టే తిరిగే కథ ఇది. మే 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.