The Royals Web Series
-
కంఫర్ట్‌గానే అనిపించింది.. అందుకే ఆ సీన్స్‌లో నటించా: హీరోయిన్
ఈ మధ్య సినిమాల్లో రొమాన్స్ ఎక్కువైపోయింది. ముద్దు సీన్స్ లేని సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్‌లలో అయితే మోతాదుకు మించిన రొమాన్స్ చూపిస్తున్నారు. హీరోయిన్లు కూడా అలాంటి సన్నివేశాలకు నో చెప్పడం లేదు. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశాలు అయినా చేయడానికి రెడీ అంటూ ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. అంతేకాదు అలాంటి సన్నివేశాలు వివాదస్పదంగా మారితే..వాటిని సమర్థిస్తూ చిత్రబృందానికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.తాజాగా బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్(Bhumi Pednekar) కూడా అదే పని చేశారు. ఆమె నటించిన ‘ది రాయల్స్’(The Royals ) వెబ్ సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అందులో హీరో ఇషాన్(Ishaan Khatter), భూమిల మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ఇషాన్ వయసులో తనకంటే ఆరేళ్లు చిన్నవాడైనా.. ఇంటిమేట్ సీన్స్ చేసింది. దీంతో పలువురు నెటిజన్స్ భూమి పెడ్నేకర్‌ని విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్ చేశారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన క్లిప్పులను పోస్ట్ చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు.తాజాగా ఈ సన్నివేశాలపై భూమి ఫెడ్నేకర్ స్పందించింది. ‘వయసులో చిన్నవాడు అయితే ఏంటి? తనతో కంఫర్ట్‌గా అనిపించింది కాబట్టే..ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేశాను’ అని చెప్పుకొచ్చింది. ‘ఇంటిమేట్ సీన్స్ చేయడం అంత ఈజీ కాదు. అలాంటి సన్నివేశాల్లో ఇమిడిపోయి నటించాలి. ఇద్దరికి కంఫర్ట్‌గా లేకపోతే ఆ సీన్ ఫేక్‌గా ఉంటుంది. అందుకే షూటింగ్‌కి ముందే మేం వర్క్‌షాప్ చేశాం. ఒకరి గురించి ఒకరం తెసుకున్నాం. ఇద్దరం బాగా క్లోజ్ అయిన తర్వాతే ఆ సీన్స్‌లో నటించాం. నాకు కంఫర్ట్‌గా అనిపించింది కాబట్టే అతనితో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేశా’ అని భూమి చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ది రాయల్స్ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఇదొక రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్. ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్, జీనత్ అమన్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. మోర్పూర్ రాయల్ కుటుంబం చుట్టే తిరిగే కథ ఇది. మే 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
అందుకే తల్లి పాత్రను తిరస్కరించాను: మల్లికా శెరావత్
‘‘ది రాయల్స్’ సిరీస్‌లో ఇషాన్ కట్టర్ తల్లి పాత్రలో నేను నటించాల్సి ఉంది. అయితే నాకు చెప్పిన కథకి, ఫైనల్ స్క్రిప్ట్‌కి సంబంధం లేదనిపించింది... అందుకే ‘ది రాయల్స్’ అవకాశాన్ని తిరస్కరించాను’’ అని చెప్పారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’. గత నెల 11న విడుదలైన ఈ సినిమాలో చందా రాణి అనే పాత్రలో తనదైన నటనతో అలరించారు మల్లికా శెరావత్.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘ఇషాన్ కట్టర్ లీడ్ రోల్లో ‘ది రాయల్స్’ సిరీస్‌ని రూపొందించాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భావించింది. ఇందులో ఇషాన్ తల్లి పాత్రలో నటించమని మేకర్స్ నన్ను సంప్రదించారు. నా పాత్ర, కథ ఎంతో నచ్చడంతో చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఫైనల్‌గా స్క్రిప్ట్ పేపర్ మీదకు వచ్చేసరికి ఎన్నో మార్పులు జరిగాయి. చెప్పిన దానికి, రాసిన దానికి సంబంధం లేదనిపించింది. దీంతో వాళ్లు నన్ను మోసం చేశారనిపించి, నేను చేయనని తిరస్కరించాను’’ అని తెలిపారు. అలాగే తన వ్యక్తిగత విషయం గురించి కూడా ఆమె స్పంది స్తూ– ‘‘గతంలో నేను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అయితే అది బ్రేకప్ అయింది. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నాను. వివాహంపై నాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి మనసు ఉన్న వ్యక్తిని భర్తగా పొందడం కష్టమే. నా ఆరోగ్యంపట్ల నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాను. అలాగే మంచి భోజనం తింటా, సమయానికి నిద్రపోతా’’ అని తెలిపారు మల్లికా శెరావత్.