breaking news
Young Global Leaders
-
కలిసి కనిపించారు.. ఇక అంతే!
బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్, మహారాష్ట్రకు చెందిన యువ రాజకీయ నేత ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే ఓ రెస్టారెంట్లో కలిసి కనిపించారు. ఇంకేముంది వారిద్దరూ కలిసివున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral) అయ్యాయి. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న గుసగుసలు మొదలైపోయాయి. జనాలు ఊహించినట్టుగా వారిద్దరి మధ్య ఏం లేదని తెలుస్తోంది.మంగళవారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలోని ఒక రెస్టారెంట్లో భూమి పడ్నేకర్, ఆదిత్య ఠాక్రే (Aditya Thackeray) కలిసి కనిపించారు. వీరిద్దరితో పాటు మరికొందరు సన్నిహితులు కూడా ఉన్నారు. కాబట్టి వారిద్దరూ డేట్‌కి వెళ్లలేదని క్లియర్‌గా అర్థమవుతుంది. వీళ్లంతా ఎందుకు రెస్టారెంట్లో కలిశారనే ప్రశ్నకు సమాధానం కూడా ఉంది.యంగ్ గ్లోబల్ లీడర్స్ (YGL) సభ్యుల కోసం భూమి పడ్నేకరే (Bhumi Pednekar) ఈ విందు ఏర్పాటు చేసిందట. ఆదిత్య ఠాక్రే, క్రిస్టర్ క్జోస్లతో పాటు పలువురు ఈ విందులో పాల్గొన్నారు. పార్టీ ముగిసిన తర్వాత బయటకు వస్తున్న క్రమంలో మీడియా ప్రతినిధులు వీరి వెంటపడ్డారు. ఇదీ అసలు విషయం. భూమి, ఆదిత్యను ఒకే చోట చూసి జనాలు మాత్రం ఏదేదో ఊహించేసుకుంటున్నారు.మొదటి భారతీయ నటిభూమి పడ్నేకర్ గురించి చెప్పాలంటే ఆమె నటకు మాత్రమే పరిమితం కాలేదు. వాతావరణ పరిరక్షణకు తన వంతు పాటుపడుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీలో సభ్యురాలిగా కూడా ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో, జెనీవాలో జరిగిన యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ నటిగా ఆమె నిలిచింది.చూడండి: 'ది ఫ్యామిలీ మ్యాన్-3' యాక్షన్ ట్రైలర్ఇమ్రాన్ ఖాన్‌తో మూవీఇక సినిమాల విషయానికొస్తే.. ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి ఒక మూవీ చేస్తోంది. ఈ సినిమా 2026 ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుందని సమాచారం. పదేళ్లకు పైగా నటనకు దూరంగా ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మళ్లీ ఈ చిత్రంతో పునరాగమనం చేస్తున్నాడు. 2015లో విడుదలైన 'కట్టి బట్టి' తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. భూమి పడ్నేకర్ నటించిన 'మేరే హస్బెండ్ కీ బీవీ' ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. Hello gorgeous 😍 Bhumi Pednekar looks stunning in an all black loook@bhumipednekar Video #PallavPaliwal #bhumipednekar #bollywood #styleicon #allblacklook #celebritystyle #fashiongoals #bollywoodbeauty #paps #bollywoodfashion #stunning pic.twitter.com/FLfbE7hFlG— HT City (@htcity) November 5, 2025 -
యంగ్ గ్లోబల్ లీడర్స్‌లో హైదరాబాదీ!
న్యూఢిల్లీ: ఇప్పటివరకు నోబెల్ బహుమతి గ్రహీతలు, పులిట్జర్ అవార్డ్ విజేతలు, దేశాధినేతలు, కంపెనీ సీఈఓలు చోటు దక్కించుకున్న యంగ్ గ్లోబల్ లీడర్స్ (వైజీఎల్)లో 2021 సంవత్సరానికి గాను హైదరాబాద్‌కు చెందిన బోలంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ సీఈఓ శ్రీకాంత్ బొల్లా ఎంపికయ్యారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ అండ్ బిజినెస్‌లో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థి అయిన శ్రీకాంత్ 2012లో హైదరాబాద్ కేంద్రంగా పర్యావరణహితమైన ప్యాకేజింగ్ కంపెనీ బోలంట్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు. ఇందులో పనిచేసేవారంతా ఏదో ఒక అంగవైకల్యం ఉన్నవారే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించిన ఈయన హైదరాబాద్‌లోని దేవ్నార్ బ్లైండ్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. మన దేశంలో ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ అధ్యయనం చేసిన మొదటి విద్యార్థి కూడా శ్రీకాంతే. వైజీఎల్–2021లో బెంగళూరు కేంద్రంగా పిల్లల మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టే లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ ఫౌండర్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి దీపికా పదుకొనే కూడా ఎంపికయ్యారు. -
డబ్ల్యూఈఎఫ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’లో ఐదుగురు భారతీయులు
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వంద మంది యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితా–2017లో ఐదుగురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. వీరిలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ.. హాస్పిటాలిటీ బ్రాండ్ తమర కూర్జ్ డైరెక్టర్ శ్రుతి శిబులాల్ ఉన్నారు. వీరితోపాటు బ్లిప్పర్ వ్యవస్థాపకుడు అంబరిశ్ మిత్రా, ఫార్చూన్ ఇండియా ఎడిటర్ హిందోల్ సేన్‌గుప్తా, స్వానిటి ఫౌండేషన్ సీఈవో రిత్విక భట్టాచార్య కూడా జాబితాలో స్థానం పొందారు. కాగా డబ్ల్యూఈఎఫ్ ప్రతి ఏడాది 40 ఏళ్లలోపు వయస్సున్న 100 మందితో ఈ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. వినూత్నమైన ఆవిష్కరణలతో ప్రపంచంలోని క్లిష్టమైన సవాళ్లకు పరిష్కారం చూపిన వారికి సంస్థ ఈ జాబితాలో స్థానం కల్పిస్తుంది.


