'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. తొలి సిరీస్ 2019లో విడుదల కాగా.. రెండో సీజన్ 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, మూడో సీజన్ నవంబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్-3 ట్రైలర్ (The Family Man S3 Trailer) విడుదల చేశారు.
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) కీలక పాత్ర పోషించారు. ఆయనకు జోడీగా ప్రియమణి నటించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగులో కూడా విడుదల కానుంది.


