నాది కాదు.. బ్లాక్‌ చేయండి : హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌ | Kindly block actress Rakul Preet Singh tweet goes viral | Sakshi
Sakshi News home page

నాది కాదు.. బ్లాక్‌ చేయండి : హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌

Nov 24 2025 6:49 PM | Updated on Nov 24 2025 7:14 PM

Kindly block actress Rakul Preet Singh tweet goes viral

సైబర్‌ నేరాలు, డేటా చోరీలు ఇంటర్నెట్‌ వినియోగదారులను వణికిస్తున్నాయి.  కొంతమంది నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలను సృష్టించి, వారి పేరుతో సన్నిహితులు, స్నేహితుల వద్ద భారీగా డబ్బు దండుకున్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ అమాయకులను బెదిరించి కోట్ల రూపాయలను దండుకున్నారు సైబర్‌ నేరగాళ్లు. మరోవైపు సోషల్‌  నకిలీ ఐడీలు, నకిలీ ఖాతాలతో వారి ఫాలోయర్లను దారుణంగా మోసగిస్తున్నారు మరి కొంతమంది.  దీనికి సంబంధించిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది. 

తన  వాట్సాప్‌ నంబరు అంటూ  నకిలీ నెంబరుతో    చాట్‌ చేస్తున్నారని  స్పందించ వద్ద అంటూ  హీరోయిన్‌ రకుల్‌  ఎక్స్‌లో ఒక ట్వీట్‌ చేసింది. ‘‘హాయ్ గైస్... ఎవరో వాట్సాప్‌లో  నాపేరుతో  జనంతో చాట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఇది నా నంబర్ కాదని గమనించండి . వారితో మాట్లాడకండి దయచేసి బ్లాక్ చేయండి’’ అనేది ఈ ట్వీట్‌ సారాంశం.

కాగా గత వారం  ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్లకు పైగా వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత వివరాలు లీక్‌ వార్త సంచలనం రేపిన సంగతి విదితమే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement