
పాల్ఘార్: మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సఫాలె–విరార్‌ల మధ్య రాకపోకలు సాగించే రో–రో ఫెర్రీ ఆదివారం సాయంత్రం సముద్రం మధ్యలోనే మొరాయించింది. ఆ సమయంలో ఫెర్రీలో 200 మంది ప్రయాణికుల, 75 వరకు వాహనాలున్నాయి. సామర్థ్యానికి మించి లోడు వేయడంతో సాంకేతిక లోపం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
హైడ్రాలిక్ ర్యాంప్ నిలిచిపోవడంతో ఎంహరంబల్‌పడ వద్ద సముద్రంలో కదలకుండా నిలిచిపోయిందని పేర్కొన్నారు. తక్కువ ఎత్తులో అలలు కూడా మరో కారణమని వివరించారు. దీంతో, కొన్ని గంటలపాటు ప్రయాణికులు ఫెర్రీపైనే ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలియడంతో పోలీసులు, మెరైన్ అధికారులు అక్కడికి చేరుకుని సమస్యను సరిచేశారు.